Internet Prices : పాకిస్థాన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు చూస్తే షాక్.. రీఛార్జ్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా బ్రో!
Starlink Internet Prices In Pakistan : పాకిస్థాన్ త్వరలో స్టార్‌లింక్ ఉపగ్రహ సేవను ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. దీనివల్ల ఇంటర్నెట్ వేగం, కనెక్టివిటీ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కానీ స్టార్‌లింక్ పాకిస్తాన్‌కు వస్తే.. దాని రీఛార్జ్ ధరలు మాత్రం దారుణంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

పాకిస్థాన్‌లో తక్కువ ఇంటర్నెట్ వేగం సమస్య కొత్తది కాదు. చాలా కాలంగా ఇంటర్నెట్ వేగం నెమ్మదించడం గురించి ఇక్కడ కంప్లైంట్ ఉంది. ప్రభుత్వ సెన్సార్‌షిప్ కారణంగా ఇంటర్నెట్ వేగం ప్రభావితమైందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో జలాంతర్గామి కేబుల్ తెగిపోవడం వల్ల ఇంటర్నెట్ నెమ్మదిగా మారిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్‌ను ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. ఇది ఇంటర్నెట్ వేగం, కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
ఎలోన్ మస్క్ స్టార్‌లింక్
ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ఆమోదించినప్పటికీ, సామాన్యులు దానిని ఉపయోగించగలరా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఉపగ్రహ ఇంటర్నెట్ ధర చాలా ఎక్కువ. ఎలోన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ పాకిస్థాన్‌లో తన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించాలనుకుంటోంది. కానీ దాని ప్లాన్స్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా లేవు. దీనికి సంబందించిన వివరాలను ఇన్‌ఫార్మల్ న్యూజ్ వెల్లడించింది.
నెలకు రూ.50వేలు!
స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ ప్లాన్ ప్రారంభ ధర నెలకు 50,000 పాకిస్థానీ రూపాయలు. ఈ ప్లాన్ లో యూజర్లు 50-250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ పొందుతారని ఇన్‌ఫార్మల్ న్యూజ్ పేర్కొంది. ఇది కాకుండా ఈ సేవను ఉపయోగించడానికి అవసరమైన హార్డ్‌వేర్ కోసం 120,000 పాకిస్తానీ రూపాయలు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.
బిజినెస్ ప్యాక్ ధర
ఎవరైనా రెసిడెన్షియల్ ప్యాకేజీ తీసుకోవాలనుకుంటే నెలకు రూ. 35,000 చెల్లించాలి. అదనంగా హార్డ్‌వేర్ కోసం ఒకేసారి రూ.110,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో బిజినెస్ ప్యాక్ ప్లాన్ తీసుకోవాలనుకునే వారికి నెలకు రూ. 95,000 ఖర్చవుతుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 100-500 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ పొందుతారు. కానీ దాని హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి వారు రూ.220,000 ఖర్చు చేయాలట.
శాటిలైట్ ఇంటర్నెట్
ఉపగ్రహ ఇంటర్నెట్ వైర్లు లేదా మొబైల్ టవర్లపై ఆధారపడి ఉండదు. దీనిలో ఇంటర్నెట్ ఉపగ్రహం ద్వారా నేరుగా ప్రసారం అవుతుంది. ఎలోన్ మస్క్ కంపెనీ కక్ష్యలోకి అనేక ఉపగ్రహాలను పంపింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. అయితే దీన్ని ఉపయోగించడానికి ఒక ప్రత్యేక రిసీవర్ అవసరం. ఈ ఇంటర్నెట్ సేవను పొందడానికి మాత్రమే దీనిని కొనుగోలు చేయాలి.
పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ వేగంతో ఎప్పుడూ సమస్యలు ఉండేవి. ఈ సమస్యకు ఉపగ్రహ ఇంటర్నెట్ పరిష్కారం కావచ్చని అంటున్నారు. కానీ దాని ఖర్చు చూస్తే మాత్రం దారుణంగా ఉందని చెబుతున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా బ్రో అని సోషల్ మీడియాలో దీనిపై కామెంట్లు కూడా వస్తున్నాయి.