Elon Musk: ‘సారీ’ చెప్పిన ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. ఎందుకంటే!-elon musk say sorry to users as twitter app taking too much space on phone ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Elon Musk Say Sorry To Users As Twitter App Taking Too Much Space On Phone

Elon Musk: ‘సారీ’ చెప్పిన ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. ఎందుకంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2023 04:28 PM IST

Elon Musk: ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ సారీ చెప్పారు. దీనికి యూజర్లు రకరకాలు స్పందించారు.

‘సారీ’ చెప్పిన ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్
‘సారీ’ చెప్పిన ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్

Twitter - Elon Musk: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాతి నుంచి చాలా మార్పులను చేస్తూనే ఉన్నారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ 2.0 ది ఎవ్రీ థింగ్ యాప్‍గా మారుస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా కొత్తకొత్త ఫీచర్లను కూడా తీసుకొస్తున్నారు. ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ తీసుకున్న వారందరికీ బ్లూటిక్, లాంగ్ ట్వీట్‍లు సహా అనే ఫీచర్లను ప్రవేశపెట్టారు. అలాగే త్వరలో ట్విట్టర్‌లో వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ట్విట్టర్ ఓనర్ ఇటీవలే వెల్లడించారు. పేమెంట్స్ ఫీచర్ కూడా ట్విట్టర్‌లో రానుందని తెలుస్తోంది. కాగా, తాజాగా ట్విట్టర్ ఓనర్ సీఈవో.. యూజర్లకు క్షమాణలు చెప్పారు. ట్విట్టర్ యాప్.. ఫోన్‍లో ఎక్కువ స్టేరేజీని తీసుకుంటోందని, సారీ చెప్పారు. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

స్క్రీన్ షాట్ షేర్ చేసి..

ఓ మొబైల్‍కు చెందిన ఫోన్ స్టోరేజ్ వివరాల స్క్రీన్ షాట్‍ను ఎలాన్ మస్క్ ట్వీట్‍ చేశారు. ఆ ఫోన్‍లో ట్విట్టర్ యాప్.. 9.52జీబీ స్టోరేజ్‍ను తీసుకుందని ఆ స్క్రీన్ షాట్‍లో ఉంది. డిస్కార్డ్ 2.01జీబీ, వాట్సాప్ 1.31జీబీ స్టోరేజ్ తీసుకుందని ఉంది. వాటిపైన మరో యాప్ 11.50జీబీ తీసుకుందని కనిపిస్తోంది. ఆ స్క్రీన్ షాట్‍ను మస్క్ ట్వీట్ చేశారు. “సారీ.. ఈ యాప్ (ట్విట్టర్) చాలా స్పేస్ తీసుకుంటోంది” అని మస్క్ ట్వీట్ చేశారు. ఫోన్‍లో యాప్‍ వినియోగం, అప్‍లోడ్స్, డౌన్‍లోడ్‍లను బట్టి యాప్ డేటా ఏర్పడుతుంది. దీంతో యాప్ తీసుకునే స్పేస్ పెరుగుతుంది. మస్క్ ఈ ట్వీట్ చేశాక యూజర్ల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి.

ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ చేసిన ఈ ట్వీట్‍ను గంటల వ్యవధిలోనే సుమారు మూడున్నర లక్షల మంది లైక్ చేశారు. చాలా మంది కామెంట్ల వర్షం కురిపించారు. కొందరు వ్యంగంగా స్పందించగా.. అకౌంట్లు సస్పెండ్ అవుతుండడంపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఇది ఓ మంచి జోక్. చాలా మంది వారి అకౌంట్లను, సంపాదించుకున్న ఫాలోవర్లందరికీ కోల్పోతున్నారు” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. అకౌంట్ల సస్పెన్షన్ విషయం కాకుండా ఈ ట్వీట్ చేయటం పట్ల చాలా మంది ఎలాన్ మస్క్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అకౌంట్ల సస్పెన్షన్ విషయంలో ఏదో ఒకటి చేయాలని మరో యూజర్ సూచించారు.

“భారీగా అకౌంట్ల సస్పెన్షన్ జరుగుతోంది. దాని గురించి ఏమీ చేయకుండా.. ఇలాంటి అనవసరమైనవి ట్వీట్ చేస్తున్నారు. నాకు విసుగొచ్చేసింది” అని ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఇక, ఈ స్క్రీన్ షాట్ మస్క్ ఫోన్‍లోది కాదని, వేరే యాజర్‌ది అని ఒకరు రాసుకొచ్చారు. ఎలాన్ మస్క్ మీమ్‍ను చోరీ చేశారని మరో యూజర్ స్పందించారు.

ట్విట్టర్ బ్లూ సబ్‍స్క్రిప్షన్ యూజర్ల కోసం మస్క్ ఇటీవల ఓ ఫీచర్ ప్రకటించారు. రెండు గంటల వరకు నిడివి ఉన్న వీడియోలు పోస్ట్ చేయవచ్చని తెలిపారు. గరిష్ఠంగా ఫైల్ 8జీబీలోపే ఉండాలని అన్నారు. అలాగే త్వరలోనే ట్విట్టర్‌లో వీడియో, వాయిస్ కాలింగ్ సదుపాయం వస్తుందని టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే ఏ యూజర్‌తో అయినా మాట్లాడవచ్చని అన్నారు. అయితే, ఎప్పటికీ ఈ కాలింగ్ ఫీచర్ వస్తుందో స్పష్టం చేయలేదు.

సంబంధిత కథనం