Twitter monetization : మస్క్ క్రేజీ 'ప్లాన్'.. ఇక ట్విట్టర్లోనూ డబ్బులు సంపాదించేయండి!
Twitter monetization : ట్విట్టర్ మోనిటైజేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎలాన్ మస్క్. యూట్యూబ్ తరహాలో.. అంత కన్నా ఎక్కువగానే ట్విట్టర్‌కు మోనిటైజేషన్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించారు.
Twitter monetization : ట్విట్టర్‌ను అధికారికంగా దక్కించుకున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. సామాజిక మాధ్యమంలో వరుస మార్పులు చేస్తున్నారు. ఓవైపు ఉద్యోగాలపై కోత విధిస్తూనే.. మరోవైపు ట్విట్టర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'ట్విట్టర్ మోనిటైజేషన్'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎలాన్ మస్క్. ట్విట్టర్లో త్వరలోనే మోనిటైజేషన్‌ను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఇదే జరిగితే.. యూట్యూబ్లాగానే.. ట్విట్టర్ నుంచి కూడా ప్రజలు డబ్బులు సంపాదించుకోవచ్చు!
ట్రెండింగ్ వార్తలు
ట్విట్టర్ మోనిటజేషన్.. యూట్యూబ్‌కు మించి!
ప్రస్తుతం ట్విట్టర్లో చిన్న టెక్స్ట్‌లు, చిన్న వీడియోలను మాత్రమే షేర్ చేసే వెసులుబాటు ఉంది. కాగా.. రానున్న రోజుల్లో ట్విట్టర్లో మార్పులు చేసి, మరిన్ని ఫార్మాట్లను తీసుకొస్తున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. వీటి ద్వారా క్రియేటర్లకు ట్విట్టర్ మోనిటైజేషన్ మోడల్‌ను తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.
Twitter monetization news : వీడియోల ద్వారా అర్జించిన యాడ్ రెవెన్యూలో 55శాతాన్ని క్రియేటర్లకు ఇస్తోంది యూట్యూబ్. కాగా.. ఈ విషయంలో యూట్యూబ్‌ను ట్విట్టర్‌ను అధిగమించే విధంగా కొత్త నిబంధనలు తీసుకొస్తామని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ట్విట్టర్ మోనిటైజేషన్ గురించి మరో రెండు వారాల్లో మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ఎలాన్ మస్క్ అన్నారు.
ట్విట్టర్ మోనిటైజేషన్పై నెటిజన్లలో హైప్ ఇప్పటికే కనిపిస్తోంది.
"యూట్యూబ్ చేసినట్టే.. ట్విట్టర్ కూడా ఫుల్ లెన్త్ వీడియోలను మేనేజ్ చేయగలిగితే.. నా వీడియోలను ఇక్కడ కూడా అప్లోజ్ చేస్తాను. కచ్చితంగా అప్లోడ్ చేస్తాను," అని ఓ క్రియేటర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పక్కా ప్లాన్‌తో మస్క్ దూకుడు..
Elon Musk Twitter : ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్.. పక్కా ప్లాన్‌తో ఉన్నట్టు కనిపిస్తోంది. బ్లూ టిక్కు 8 డాలర్లు చెల్లించాలన్న రూల్‌ను అమెరికాలో అమలు చేశారు. ఇది ఇండియాలోనూ త్వరలో అమలు కానుంది.
ఇక ఉద్యోగాల కోత విషయాన్ని కొస్తే.. అమెరికా ట్విట్టర్ కార్యాలయంలో సగం మందికి పైగా ఉద్యోగులు.. జాబ్స్ కోల్పోయినట్టు తెలుస్తోంది. కాగా.. వారిలో కొందరిని మస్క్ వెనక్కి పిలిపించినట్టు సమచారం. పూర్తి వివరాల కసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు ట్విట్టర్ ఇండియా కార్యాలయంలోను 90శాతం మంది జాబ్స్ కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. 15మంది మాత్రమే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం
Elon Musk Twitter : రోజంతా తిట్టినా.. మార్చేది లేదు : ఎలాన్ మస్క్
November 05 2022
Twitter India layoffs : ట్విట్టర్ ఇండియాలో భారీగా ఉద్యోగాల కోత..!
November 04 2022