Twitter blue bird logo : ట్విట్టర్​లో బ్లూ బర్డ్​ లోగోను పీకేసిన మస్క్​.. ఆ స్థానంలో డోజీ మీమ్​!-elon musk replaces twitter s blue bird logo with doge meme ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Elon Musk Replaces Twitter's Blue Bird Logo With 'Doge' Meme

Twitter blue bird logo : ట్విట్టర్​లో బ్లూ బర్డ్​ లోగోను పీకేసిన మస్క్​.. ఆ స్థానంలో డోజీ మీమ్​!

Sharath Chitturi HT Telugu
Apr 04, 2023 07:51 AM IST

Twitter blue bird logo changed : ట్విట్టర్​ బ్లూ బర్డ్​ లోగోను పీకేశారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్​ మస్క్​. ఆ స్థానంలో వచ్చిన లోగోను చూసి అందరు షాక్​ అవుతున్నారు.

ట్విట్టర్​లో బ్లూ బర్డ్​ లోగోను పీకేసిన మస్క్
ట్విట్టర్​లో బ్లూ బర్డ్​ లోగోను పీకేసిన మస్క్ (unsplash)

Twitter blue bird logo removed : ట్విట్టర్​ అంటే ముందుగా గుర్తొచ్చేది.. ఐకానిక్​ బ్లూ బర్డ్​ లోగో. ఇకపై ఆ లోగో కనిపించకపోవచ్చు! బ్లూ బర్డ్​ లోగోను ట్విట్టర్​ సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ పీకేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం.. ఆ స్థానంలో కుక్క ముఖం ఉన్న ఫేమస్​ 'డోజీ' మీమ్​ దర్శనమిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ట్విట్టర్​ బ్లూ బర్డ్​ లోగో మాయం..!

ట్విట్టర్​ వెబ్​ వర్షెన్​ హోం బటన్​లో ఇంతకాలం బ్లూ బర్డ్​ లోగో కనిపించేది. కానీ ఇప్పుడు.. డోజీకాయిన్​ క్రిప్టోకరెన్సీ మీమ్​ 'డోజీ' దర్శనమిస్తోంది. ఈ వార్త ఇన్​స్టెంట్​గా వైరల్​ అయ్యింది. ట్విట్టర్​ 'డోజీ' తెగ ట్రెండ్​ అవుతోంది. కొత్త లోగోను చూసి కొందరు షాక్​ అవుతున్నారు. అయితే.. మొబైల్​ యాప్​ వర్షెన్​లో మాత్రం ట్విట్టర్​ లోగో ఇంకా పాతదే కొనసాగుతోంది.

Twitter new logo : డోజీకాయిన్​ బ్లాక్​చెయిన్​, క్రిప్టోకరెన్సీలో ఈ డోజీ భాగం. అయితే.. మస్క్​ పెట్టిన డోజీ.. క్రిప్టోకరెన్సీకి మీమ్​ వర్షెన్​. కొత్త లోగోను చూసి కొందరు షాక్​ అవుతున్నారు. అయితే.. మొబైల్​ యాప్​ వర్షెన్​లో మాత్రం ట్విట్టర్​ లోగో ఇంకా పాతదే కొనసాగుతోంది.

తాజా పరిణామాల మధ్య ఓ పోస్ట్​ని కూడా షేర్​ చేశారు ఎలాన్​ మస్క్​. అందులో ఓ కారులో ఓ శునకం ఉంది. ట్రాఫిక్​ పోలీస్​ ఆ శునకం డ్రైవింగ్​ లైసెన్స్​ చెక్​ చేస్తున్నాడు. ఆ లైసెన్స్​లో ట్విట్టర్​ బ్లూ బర్డ్​ లోగో కనిపిస్తోంది. 'అది పాత ఫొటో'అని కుక్క సమాధానం ఇస్తోంది.

డోజీపై ఎందుకింత ప్రేమ..!

Doge meme as twitter logo : ఈ క్రమంలో 2022 మార్చ్​ 26న ఓ ట్విట్టర్​ యూజర్​తో జరిగిన సంభాషణను కూడా పోస్ట్​ చేశారు మస్క్​. 'ట్విట్టర్​ని కొనేసి, బ్లూ బర్డ్​ స్థానంలో డోజీని పెట్టు,' అని ఆ వ్యక్తి ఎలామ్​ మస్క్​కు సూచించాడు. 'హామీని నెరవేర్చుకున్నా,' అని ఇప్పుడు మస్క్​ ట్వీట్​ చేశారు.

వివిధ నివేదికల ప్రకారం.. 44 బిలియన్​ డాలర్లు వెచ్చించి ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్​.. డోజీ మీమ్​కు అతిపెద్ద​ ఫ్యాన్​! డోజీకాయిన్​ను ఆయన ఎన్నో సందర్భాల్లో ప్రమోట్​ చేశారు కూడా. ట్విట్టర్​ లోగో డోజీ మీమ్​ ఉండటంతో.. డోజీకాయిన్​ వాల్యూ ఏకంగా 20శాతం పెరిగడం గమనార్హం.

డోజీ మీమ్​పై మస్క్​కు ఉన్న ప్రేమ అనేక సందర్భాల్లో బయటపడింది. ‘ట్విట్టర్​ కొత్త సీఈఓ ఎవరో తెలుసా?’ అంటూ ఇటీవలే ఓ ట్వీట్​ చేశరు మస్క్​. అందులోనూ ఈ డోజీనే దర్శనమిచ్చింది.

ట్విట్టర్​ లోగో మార్పు తాత్కాలికమో.. లేక నిజంగానే మారిపోతుందో ఎలాన్​ మస్క్​కే తెలియాలి!

WhatsApp channel

సంబంధిత కథనం