Elon Musk: రెండు రోజులకే: మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన మస్క్: కారణమిదే
Elon Musk - World Richest List: ప్రపంచ కుబేరుడి స్థానాన్ని ఎలాన్ మస్క్ మరోసారి కోల్పోయారు. రెండు రోజులకే మళ్లీ కిందికి దిగొచ్చారు.
Elon Musk - World’s Richest Persons List: ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో అగ్రస్థానాన్ని ఎలాన్ మస్క్ (Elon) మళ్లీ కోల్పోయారు. టాప్ ప్లేస్‍కు చేరిన 48 గంటల్లోనే మరోసారి కిందికి వచ్చారు. ఈ విషయాన్ని బ్లూమ్‍బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) వెల్లడించింది. టెస్లా, స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ ఈ వారంలో వరల్డ్స్ రిసెస్ట్ పర్సన్ జాబితాలో మరోసారి తొలి స్థానానికి వచ్చారు. 187.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన టాప్ ప్లేస్‍కు చేరారు. అయితే రెండు రోజుల తర్వాత ఆయన మళ్లీ రెండో స్థానానికి పడిపోయారు. పూర్తి వివరాలు ఇవే.
కారణం ఇదే..
Elon Musk - World’s Richest Persons List: అమెరికా స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్ ధర (Tesla Share) రెండు ట్రేడింగ్ సెషన్‍లలో 7శాతానికిపైగా పడిపోయింది. దీంతో మళ్లీ భారీగా సంపదను మస్క్ కోల్పోయారు. ప్రస్తుతం మస్క్ సంపద 176 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‍బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ విటన్ (Louis Vuitton) సంస్థ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ (Bernard Arnault) మళ్లీ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. అత్యధిక ధనికుల జాబితాలో అగ్రస్థానానికి ఆయన చేరారు. టెస్లా షేరు పతనంతో మస్క్ సంపద మళ్లీ 180 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడింది. ప్రస్తుతం అర్నాల్ట్ సంపద 187 బిలియన్ డాలర్లుగా ఉంది. కేవలం రెండు రోజుల్లోనే అర్నాల్ట్ మళ్లీ ఫస్ట్ ప్లేస్‍కు చేరుకున్నారు.
ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో ప్రస్తుతం భారత్‍కు చెందిన ముకేశ్ అంబానీ (79.9 బిలియన్ డాలర్లు) 11వ స్థానంలో, గౌతమ్ అదానీ (44.7 బిలియన్ డాలర్లు) 28వ స్థానంలో ఉన్నారు.
Elon Musk - World’s Richest Persons List: టెస్లా షేర్ 65శాతం వరకు పడిపోవటంతో 2022 డిసెంబర్‌లో అత్యంత ధనికుల జాబితాలో మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. అప్పటి నుంచి అర్నాల్ట్ ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నారు. అయితే, ఇటీవల టెస్లా షేర్ అనూహ్యంగా పుంజుకోవటంతో మస్క్ మళ్లీ ఫస్ట్ ప్లేస్‍కు వచ్చారు. అయితే అది రెండు రోజులుగా కూడా నిలువలేదు. నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2022 మధ్య ఎలాన్ మస్క్ ఏకంగా 200 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు.
Elon Musk: చైనాలో కొవిడ్-19 ప్రభావం, ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ దక్కించుకోవడం టెస్లా కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చైనాలో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గటంతో విలువ బాగా పడిపోయింది. మరోవైపు ట్విట్టర్‌కు ఎలాంటి ఆదాయం రావడం లేదంటూ ఆయన ఇటీవల ట్వీట్స్ చేస్తున్నారు. ఆదాయం లేని అత్యంత పెద్ద సంస్థ ట్విట్టరేనంటూ ఇటీవల మస్క్ పేర్కొన్నారు.
Elon Musk - Twitter: 44 మిలియన్ డాలర్లతో గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు టెస్లా బాస్ ఎలాన్ మస్క్. ప్రతీ రోజు ట్విట్టర్ 4 మిలియన్ డాలర్లను నష్టపోతోందని ఆ తర్వాత తెలిపారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటి వరకు ఏకంగా సంస్థలో 75శాతం మంది ఉద్యోగులను ఆయన తొలగించారు. మస్క్ హస్తగతం కాకముందు ట్విట్టర్‌లో సుమారు 7,500 మంది ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా సుమారు 2,000కు తగ్గింది.
సంబంధిత కథనం