మీ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ రేంజ్ ఇస్తే.. ఈరోజే ఈ 5 పనులు చేయండి!-electric scooter how to increase ev two wheeler range follow these 5 simple tips ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మీ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ రేంజ్ ఇస్తే.. ఈరోజే ఈ 5 పనులు చేయండి!

మీ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ రేంజ్ ఇస్తే.. ఈరోజే ఈ 5 పనులు చేయండి!

Anand Sai HT Telugu

ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగించడానికి పలు మార్గాలు ఉన్నాయి. ఈవీని కొన్ని రోజులు వాడిన తర్వాత తక్కువ రేంజ్ ఇస్తుంది. కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మెరుగైన పనితీరుతోపాటుగా రేంజ్ కూడా పెరుగుతుంది.

ప్రతీకాత్మక చిత్రం

ేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీలు అధునాతన, సురక్షితమైన బ్యాటరీలతో కూడిన మోడళ్లను కూడా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపడానికి, ఉపయోగించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియదు. కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈవీ మంచి రేంజ్ ఇస్తుంది.

  1. మీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై క్రమం తప్పకుండా ఓవర్‌లోడ్ వేస్తుంటే ఈరోజే అలా చేయడం మానేయండి. అలా చేయడం వల్ల వాహనంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీని వలన బ్యాటరీ వేగంగా అయిపోతుంది. తక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఈవీపై ఎక్కువ బరువు వేయకూడదు.
  2. ఈవీ రెండు టైర్లలో గాలి సరిగ్గా ఉండేలా చూసుకోండి. సరైన గాలి పీడనం శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. మెరుగైన రేంజ్ కూడా అందిస్తుంది. వారానికి ఒకసారి టైర్‌లో గాలిని తనిఖీ చేయండి. వీలైతే స్కూటర్‌ను ఎకో మోడ్‌లో మాత్రమే నడపండి. ఇది శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. మంచి రేంజ్ అందిస్తుంది.
  3. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని స్థిరమైన వేగంతో నడపండి. కారణం లేకుండా ఎక్కువ, తక్కువ స్పీడుతో నడపవద్దు. ఎందుకంటే ఇది బ్యాటరీని వేగంగా ఖాళీ చేస్తుంది. తక్కువ రేంజ్ ఇస్తుంది. స్కూటర్ వేగాన్ని గంటకు 40-60 కి.మీ వద్ద ఉంచండి.
  4. ట్రాఫిక్ జామ్ తక్కువగా ఉన్న మార్గంలో మీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లండి. ఎల్లప్పుడూ చిన్న మార్గాన్ని ఎంచుకోండి. నావిగేషన్‌ను ఉపయోగించండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగించండి. ఈ విధంగా బ్రేకింగ్ చేసేటప్పుడు శక్తి బ్యాటరీలోకి తిరిగి వెళుతుంది. తద్వారా స్కూటర్ రేంజ్ పెరుగుతుంది.
  5. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోండి. దాని బ్యాటరీని చెక్ చేయండి. బ్యాటరీని ఎల్లప్పుడూ 80-90 శాతం వరకు ఛార్జ్ చేయండి. ఇలా చేయడం ద్వారా బ్యాటరీ జీవితకాలం పెంచడంతో పాటు స్కూటర్ రేంజ్ కూడా పెరుగుతుంది. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కాకుండా కాపాడుకోండి. బ్యాటరీని సరిగ్గా నిర్వహించడం ద్వారా దాని సామర్థ్యంతో పాటు జీవితకాలం కూడా పెరుగుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.