MG Electric Cars : ఈ కంపెనీ మెుత్తం అమ్మకాల్లో 78 శాతానికి పైగా ఎలక్ట్రిక్ కార్లదే-electric cars contribute over 78 percentage to jsw mg motor india total volumes in february 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Electric Cars : ఈ కంపెనీ మెుత్తం అమ్మకాల్లో 78 శాతానికి పైగా ఎలక్ట్రిక్ కార్లదే

MG Electric Cars : ఈ కంపెనీ మెుత్తం అమ్మకాల్లో 78 శాతానికి పైగా ఎలక్ట్రిక్ కార్లదే

Anand Sai HT Telugu

MG Windsor EV : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా గత నెలలో అంటే 2025 ఫిబ్రవరిలో 4,000 కార్లను విక్రయించింది. కంపెనీ మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగం వాటా 78 శాతానికి పైగా ఉంది.

ఎంజీ కారు

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2025 ఫిబ్రవరిలో 4,000 కార్ల అమ్మకాలు చేసింది. ఈ మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 78 శాతానికిపైగా ఉంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ సేల్ తెలియజేస్తోంది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 4,002 మంది కొత్త కస్టమర్లను సంపాదించింది. కంపెనీకి ఈ అమ్మకాలకు రావడానికి ఎంజీ విండ్సర్ ఈవీ చాలా ఉపయోగపడింది.

ఎంజీ విండ్సర్ ఈవీ మోడల్ ఇటీవల 15,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించింది. కొన్ని నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా విండ్సర్ ఈవీ నిలిచింది. విండ్సర్ ఈవీ మైలురాయిపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. '2024 సంవత్సరం మాకు గొప్పది. మేం మా బ్రాండ్ పేరును పునరుద్ధరించాం. ఇది కాకుండా ఎంజీ విండ్సర్ ఈవీని విడుదల చేసింది. దీనికి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తోంది.' అని చెప్పారు.

రానున్న 2 కొత్త మోడళ్లు

రాబోయే రోజుల్లో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ సైబర్ స్టర్ ను విడుదల చేయబోతోంది. ఇది కాకుండా ఎంజి ఎం9ను కూడా భారత మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రాబోయే రెండు మోడళ్లను బ్రాండ్ ప్రీమియం రిటైల్ ఛానల్ 'ఎంజి సెలెక్ట్' డీలర్‌షిప్ ద్వారా విక్రయించనున్నారు. ఈ రెండు కార్ల విడుదల భారత మార్కెట్లో కంపెనీ ఎలక్ట్రిక్ మోడల్ అమ్మకాలను మరింత బలోపేతం చేస్తుంది.

పెద్ద బ్యాటరీతో విండ్సర్ ఈవీ

మరోవైపు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా హై స్పెక్ విండ్సర్ ఈవీ లాంచ్ కోసం సిద్ధమవుతోంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 400 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉన్న ఎంజీ విండ్సర్ EV 50.3kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ 2025 నాటికి వస్తుందని భావిస్తున్నారు. రాబోయే నెలల్లో పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమవుతోంది కంపెనీ.

రాబోయే ఎంజీ విండ్సర్ ఈవీ సౌకర్యం, సాంకేతికతపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. లోపల మీరు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌తో అతిపెద్ద 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్‌ పొందుతారు. క్లైమేట్ కంట్రోల్ డ్యూయల్-జోన్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిక్లైనింగ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి రానున్నాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం