Stock market holiday: జూన్ 17 సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు; ఎందుకంటే..?
Stock market holiday: జూన్ 17, సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్లు పని చేయవు. ఆ రోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లకు సెలవు ఉంటుంది. స్టాక్ మార్కెట్లో జూన్ 18 న తిరిగి ట్రేడింగ్ ప్రారంభమవుతుందని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తెలిపాయి.
Stock market holiday: బక్రీద్ కారణంగా జూన్ 17 సోమవారం ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు మూతపడనున్నాయి. బీఎస్ఈ వెబ్సైట్ ప్రకారం, ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ లలో కూడా జూన్ 17 న కార్యకలాపాలు జరగవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో జూన్ 18 న ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (MCX) కూడా జూన్ 17 ఉదయం సెషన్ కు మూసివేయబడుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30/11.55 గంటల వరకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (MCX) లో ట్రేడింగ్ కొనసాగుతుంది.
2024 లో తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు ఎప్పుడు?
బక్రీద్ సందర్భంగా 2024 జూన్ 17, సోమవారం స్టాక్ మార్కెట్ (stock market) కు సెలవు ఉంటుంది. ఆ తరువాత, మళ్లీ జులై 17న మొహర్రం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. 2024 క్యాలెండర్ ఇయర్లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లకు 14 రోజులు సెలవులు ఉన్నట్లు బీఎస్ఈ తెలిపింది. ఆ వివరాలను బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ https://www.bseindia.com/ లో చూడవచ్చు. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో రిపబ్లిక్ డే (జనవరి 26), మహాశివరాత్రి (మార్చి 8), హోలీ (మార్చి 25), గుడ్ ఫ్రైడే (మార్చి 2029), రంజాన్ ఈద్ (ఏప్రిల్ 11), శ్రీరామ నవమి (ఏప్రిల్ 17), మహారాష్ట్ర దినోత్సవం (మే 1) కోసం స్టాక్ మార్కెట్ కు సెలవు ప్రకటించారు. ఇకపై, బక్రీద్ (జూన్ 17), మొహర్రం (జూలై 17), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), మహాత్మాగాంధీ జయంతి (అక్టోబర్ 2), దీపావళి (నవంబర్ 1), గురునానక్ జయంతి (నవంబర్ 15), క్రిస్మస్ (డిసెంబర్ 25) రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది.
టాపిక్