Ducati Desert X Discovery : హైటెక్ ఫీచర్లతో యూత్‌కి పిచ్చెక్కించే క్రేజీ బైక్.. అడ్వెంచర్స్ చేసేవారికి నచ్చేస్తుంది!
Ducati Desert X Discovery : డుకాటీ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ బుకింగ్స్ ఇప్పటికే భారత మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ఈ బైక్‌లో ఎన్నో హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ స్పెషాలిటీ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
మీకు అడ్వెంచర్ చేయడం ఇష్టమైతే.. మంచి ఇంజిన్ ఉన్న మోటార్ సైకిల్ కోసం చూస్తే.. మీ కోసం ఓ గుడ్‌న్యూస్. ఎందుకంటే డుకాటీ ఇండియా తన కొత్త, విలాసవంతమైన డుకాటీ ఎక్స్ డిస్కవరీ బైక్ బుకింగ్ ప్రారంభించింది. ఈ బైక్ ను గతంలో పలుమార్లు ఆన్‌లైన్‌లో టీజ్ చేశారు. త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రేట్ అడ్వెంచర్ బైక్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.

డుకాటీ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ అడ్వెంచర్, ఆఫ్-రోడింగ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బైక్ డిజైన్ దాని డెసర్ట్ ఎక్స్ బైక్‌ను పోలి ఉంటుంది. అయితే దీనికి నలుపు, ఎరుపు పెయింట్ ఇచ్చారు. ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ బైక్ హార్డ్ కేస్ పానియర్స్(లగేజీ క్యారియర్), ఇంజిన్ కవర్ ప్రొటెక్షన్, పెద్ద బెల్లీ గార్డ్‌తో వస్తుంది. దూర ప్రయాణాలకు మంచి ఆప్షన్.
ఇంజిన్
డుకాటీ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీలో 937సిసి, ఎల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 9,250 ఆర్పీఎమ్ వద్ద 108 బిహెచ్పీ శక్తిని, 92 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్‌ను కలిగి ఉంది. గేర్ షిఫ్టింగ్‌ను చాలా స్మూత్‌గా, వేగంగా చేస్తుంది.
హైటెక్ ఫీచర్లు
డుకాటీ హైటెక్ ఫీచర్లతో ఈ బైక్ ను రూపొందించింది. ఇందులో మీ అవసరాన్ని బట్టి పవర్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు. హై-స్పీడ్ స్టంట్స్ కోసం సేఫ్టీ ఫీచర్ వీలీ కంట్రోల్‌ను అందించారు. స్మూత్ డౌన్ షిఫ్టింగ్ కోసం ఇంజన్ బ్రేక్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది. లాంగ్ రైడ్స్ కోసం క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా చల్లని వాతావరణంలో కూడా సౌకర్యవంతమైన రైడింగ్ కోసం వేడి గ్రిప్స్ ఏర్పాటు చేశారు. నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్ కోసం టీఎఫ్‌టీ డిస్‌ప్లే అందించారు.
డుకాటీ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ మంచి సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఇందులో 46 ఎంఎం పూర్తిగా అడ్జస్టబుల్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ ఉంది. ఈ బైక్ ఆఫ్-రోడింగ్ కోసం అద్భుతమైన కెవైబీ పూర్తిగా సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ను కలిగి ఉంది. డ్యూయల్ 320 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, సింగిల్ 265 ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇది 21 అంగుళాల ముందు, 18 అంగుళాల వెనుక స్పోక్ వీల్స్ కలిగి ఉంది.
ధర
డుకాటీ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ ధర రూ.21 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ డుకాటీ డీలర్ షిప్ లలో ప్రారంభమయ్యాయి. దీని అధికారిక లాంచ్ తేదీని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
టాపిక్