Droneacharya Aerial IPO:డ్రోన్ ఆచార్య ఐపీఓకు మంచి స్పందన; కొనొచ్చంటున్న నిపుణులు-droneacharya aerial ipo sees massive demand subscribed 6 times in 4 hours ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Droneacharya Aerial Ipo Sees Massive Demand, Subscribed 6 Times In 4 Hours

Droneacharya Aerial IPO:డ్రోన్ ఆచార్య ఐపీఓకు మంచి స్పందన; కొనొచ్చంటున్న నిపుణులు

HT Telugu Desk HT Telugu
Dec 13, 2022 08:38 PM IST

డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ ఐపీఓ(Droneacharya Aerial Innovation IPO)కు మదుపరుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Droneacharya Aerial Innovations IPO: డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ ఐపీఓ(Droneacharya Aerial Innovation IPO) మంగళవారం ఓపెన్ అయింది. తొలిరోజే ఇన్వెస్టర్ల నుంచి సానుకూల స్పందనను ఈ ఐపీఓ సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Droneacharya Aerial Innovations IPO: డ్రోన్ టెక్నాలజీ..

తొలిరోజే ఈ డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ ఐపీఓ(Droneacharya Aerial Innovation IPO) 22.94 రెట్ల సబ్ స్క్రిప్షన్ సాధించడం విశేషం. అలాగే ఐపీఓలోని రిటైల్ పోర్షన్ 37.89 రెట్ల సబ్ స్క్రిప్షన్ సాధించిందని డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ సంస్థ వెల్లడించింది. రిటైల్ కేటగిరీలో 20.92 లక్షల షేర్లను అమ్మేందుకు ఉద్దేశించిన ఈ ఐపీఓలో తొలి రోజే 7.92 కోట్ల షేర్ల కొనుగోలుకు సబ్ స్క్రిప్షన్ లభించింది. గ్రే మార్కెట్ల ఈ సంస్థ షేరు ఇప్పుడు రూ. 65 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. నాన్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్(Non-Institutional Investor) కేటగిరీలో 17.25 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ బయర్ (Qualified Institutional Buyer) కేటగిరీలో 1.03 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది.

IPO news: జీఎంపీ ఎంత?

డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ ఐపీఓ(Droneacharya Aerial Innovation IPO) డిసెంబర్ 13, 2022 న ప్రారంభమైంది. డిసెంబర్ 15న ముగుస్తుంది. షేరు లాట్ సైజ్ 2000 షేర్లు. ప్రైస్ బ్యాండ్ రూ. 52 నుంచి రూ. 54గా నిర్ధారించారు. అంటే, ఈ షేరుకు గ్రే మార్కెట్ లో ఉన్న రూ. 65 ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికే ఈ షేరు విలువ రూ 120% పెరిగినట్లు తెలుస్తుంది. అయితే, లిస్టింగ్ సమయానికి గ్రే మార్కెట్ ధరలో హెచ్చుతగ్గులకు అవకాశం ఉంటుందన్న విషయం గమనార్హం.

Droneacharya Aerial Innovation IPO: ఐపీఓ వివరాలు

  • ఐపీఓ ఓపెన్ అయిన తేదీ - 13-12- 2022
  • ఐపీఓ ముగింపు తేదీ - 15-12- 2022
  • అలాట్ మెంట్ తేదీ - 20-12- 2022
  • లిస్టింగ్ తేదీ - 23-12- 2022
  • షేర్ ప్రైస్ బ్యాండ్ - రూ. 52 నుంచి రూ. 54
  • లాట్ సైజ్ - 2000
  • ఐపీఓ దరఖాస్తుకు అవసరమైన కనీస మొత్తం - రూ. 1,08,000

Droneacharya Aerial Innovation: డ్రోన్ ట్రైనింగ్

ఈ డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ ఐపీఓ(Droneacharya Aerial Innovation IPO) డీజీసీఏ(Directorate General of Civil Aviation) అనుమతి పొందిన రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గైనైజేషన్. ఈ సంస్థ డ్రోన్ నిర్మాణం, ఏరియల్ సినిమాటోగ్రఫీ, డేటా ప్రాసెసింగ్, పైథాన్ ఫర్ జీఐఎస్(Python for GIS), డ్రోన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, డ్రోన్ రేసింగ్ సేవలను అందిస్తుంది. 2022 లో ఈ సంస్థ 180 మందికి డ్రోన్ పైలటింగ్ లో శిక్షణ ఇచ్చింది. ఈ ఐపీఓకు మెజారిటీ స్టాక్ మార్కెట్ నిపుణులు సానుకూల రేటింగ్స్ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ కోసం అనువైన షేర్ గా పేర్కొంటున్నారు. అంతేకాదు, జీఎంపీ ని పరిగణనలోకి తీసుకున్నా.. లిస్టింగ్ బెనిఫిట్స్ పొందవచ్చని వివరిస్తున్నారు. అన్ లిస్టెడ్ అసెట్స్ కంపెనీ వ్యవస్థాపకుడు మనీశ్ ఖన్నా ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ ట్యాగ్ ఇస్తున్నారు.

(సూచన: ఇక్కడ పేర్కొన్న వివరాలు, సిఫారసులు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. మదుపర్లు సొంత విశ్లేషణతో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం)

WhatsApp channel

టాపిక్