Dr Reddy's Q3 results: డాక్టర్ రెడ్డీస్ Q3 లాభాల్లో 77% వృద్ధి-dr reddy s q3 net profit surges 77 to rs 1 247 cr ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Dr Reddy's Q3 Net Profit Surges 77% To <Span Class='webrupee'>₹</span>1,247 Cr

Dr Reddy's Q3 results: డాక్టర్ రెడ్డీస్ Q3 లాభాల్లో 77% వృద్ధి

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 07:29 PM IST

Dr Reddy's Q3 results: ప్రముఖ భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (Dr Reddy's Laboratories) మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటించింది. ఈ Q3 లో డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's Laboratories) నికర లాభాల్లో 77% వృద్ధి కనబర్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Dr Reddy's Q3 results: ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (Dr Reddy's Laboratories) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అద్భుత ఫలితాలను (Dr Reddy's Q3 results) ప్రకటించింది. సంస్థ నికర లాభాల్లో గత Q3 తో పోలిస్తే 77% వృద్ధి నమోదు కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Dr Reddy's Q3 net profits: రూ. 1,247 కోట్లు

ఈ Q3 లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (Dr Reddy's Laboratories) రూ. 6770 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది. ఇది గత Q3 తో పోలిస్తే, 27% అధికం. గత Q3 లో డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ. 5319.7 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం Q3 లో రూ. 1,247 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్లు డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's Laboratories) బుధవారం ప్రకటించింది. ఇది గత Q3 కన్నా 76.5% ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం Q3లో డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's Laboratories) నికర లాభాలు రూ. 706.5 కోట్లు.

Dr Reddy's Q3 results: అంతర్జాతీయంగా మెరుగైన ఆపరేషన్స్

అంతర్జాతీయంగా, ముఖ్యంగా, అమెరికా, రష్యా మార్కెట్లలో మెరుగైన ఫలితాలను సాధించడం వల్ల ఈ త్రైమాసికం Dr (Reddy's Q3 results) నికర లాభాల్లో గణనీయ వృద్ధి సాధ్యమైందని డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's Laboratories) ప్రకటించింది. అంతర్జాతీయంగా మరింత విస్తరించడానికి, ఆర్ అండ్ డీ ప్రణాళికలకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ వెల్లడించారు. గ్లోబల్ జనరిక్ సెగ్మెంట్ లో ఈ Q3 (Dr Reddy's Q3 results) లో డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ. 5,924.1 కోట్లు. ఇది గత Q3 కన్నా 33% అధికం. డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's Laboratories) ఆదాయం గత Q3తో పోలిస్తే ఈ Q3 లో ఉత్తర అమెరికా మార్కెట్లో 64%, యూరోప్ మార్కెట్లో6%, భారత్ మార్కెట్లో 10%, ఇతర మార్కెట్లలో 14% వృద్ధి నమోదైంది. గ్లోబల్ జనరిక్ మార్కెట్లో మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన ఫలితంగా ఈ ఆదాయం (Dr Reddy's Q3 results) సమకూరిందని సంస్థ వెల్లడించింది. నార్త్ అమెరికా మార్కెట్ నుంచి సమకూరిన మొత్తం ఆదాయం రూ. 30.6 బిలియన్లు. అలాగే, ఇండియా మార్కెట్ నుంచి రూ. 11.3 బిలియన్లు, యూరోప్ మార్కెట్ నుంచి రూ. 4.3 బిలియన్ల ఆదాయం సమకూరింది. బుధవారం షేర్ మార్కెట్లో డాక్టర్ రెడ్డీస్ (Dr Reddy's Laboratories) షేర్ వాల్యూ 1.24% తగ్గి, రూ. 4200 వద్ధ స్థిరపడింది.

WhatsApp channel