Sanchar Saathi: స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే సంచార్ సాథీ మొబైల్ యాప్; టెలికాం శాఖ ఆవిష్కరణ-dot launches sanchar saathi mobile app to crack down on fraud communications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sanchar Saathi: స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే సంచార్ సాథీ మొబైల్ యాప్; టెలికాం శాఖ ఆవిష్కరణ

Sanchar Saathi: స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే సంచార్ సాథీ మొబైల్ యాప్; టెలికాం శాఖ ఆవిష్కరణ

Sudarshan V HT Telugu

Sanchar Saathi app: మొబైల్ ఫోన్ వినియోగదారులను విసుగెత్తిస్తున్న స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర టెలీకాం శాఖ సంచార్ సాథీ పేరుతో ఒక మొబైల్ యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ తో వినియోగదారులు వారి మొబైల్ ఫోన్ కాల్ లాగ్ ల నుండి నేరుగా మోసపూరిత కాల్స్ ను ఫ్లాగ్ చేయవచ్చు.

సంచార్ సాథీ మొబైల్ యాప్

Sanchar Saathi mobile app: మోసపూరిత కాల్స్, మెసేజెస్ నుంచి వినియోగదారులను కాపాడే ఉద్దేశంతో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DOT) 2025 జనవరి 17, శుక్రవారం సంచార్ సాథీ మొబైల్ యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి నేరుగా ఇలాంటి మోసపూరిత కాల్స్ ను, మెసేజెస్ ను ఫ్లాగ్ చేయవచ్చు.

అధికారిక యాప్

‘‘సంచార్ సాథీ యాప్ ఇప్పుడు లైవ్లో ఉంది. ఈ రోజు మీ డిజిటల్ భద్రత కోసం ఈ యాప్ ను స్కాన్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.’’ అని డాట్ తన అధికారిక హ్యాండిల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో శుక్రవారం ప్రకటించింది. టెలీకాం శాఖ సంచార్ సాథీ పోర్టల్ ను 2023 లోనే ప్రారంభించింది. ఇప్పుడు, తాజాగా ఈ యాప్ (APPS) ద్వారా యూజర్లు తక్షణమే, సులభంగా, తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి మోసపూరిత కమ్యూనికేషన్లను రిపోర్ట్ చేయడానికి వీలవుతుంది.

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ లో..

సంచార్ సాథీ యాప్ గూగుల్ (GOOGLE) ప్లే స్టోర్, ఆపిల్ (APPLE) స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ‘‘ఈ సంచార్ సాథీ ప్రొగ్రామ్ ప్రతి కస్టమర్ గోప్యతను, భద్రతను పరిరక్షించే సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది’’ అని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. 'విజన్ ఫర్ నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ 2.0', 'డిజిటల్ భారత్ నిధి' నిధులతో 4జీ మొబైల్ సైట్లలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ వంటి మరో రెండు కార్యక్రమాలను సింధియా ప్రారంభించారు.