Housing Loan Insurance: ఇంటి రుణానికి ఇన్సూరెన్స్ మరువొద్దు.. భారమైనా కట్టడం మరువకండి…
Housing Loan Insurance: సొంతింటి కల నెరవేర్చుకోడానికి రుణం తీసుకోవడంతో పాటు దానికి బీమా రక్షణ కల్పించడం మరువకూడదు. ఇంటి రుణం తీసుకున్న వ్యక్తికి జరగరానిది ఏదైనా జరిగితే ఇంటి రుణం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబంపై పడుతుంది. బీమా రక్షణ లేకపోతే ఆ ఇంటిని కోల్పోవాల్సి రావొచ్చు.
Housing Loan Insurance: ఎవరికైనా సొంతింటి కలను నెరవేర్చుకోవటం జీవిత లక్ష్యంగా ఉంటుంది. జీవితంలో స్థిరపడిన తర్వాత సేవింగ్స్‌తో పాటు గృహ రుణం తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో ఇంటి రుణానికి బీమా రక్షణ కల్పించడం అసలు మరువకూడదు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం రూ.10లక్షల రుణం తీసుకున్నాడనుకుంటే దానికి రూ.8800 ఈఎంఐగా ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది.
ఈఎంఐతో పాటు బీమా ప్రీమియంగా మరో రూ.400 అదనంగాచెల్లిస్తూ వచ్చాడు. ఇంటి రుణం తీసుకున్న కొద్ది నెలలకే ప్రమాదవశాత్తూ సదరు వ్యక్తి మరణిస్తే మిగతా వాయిదాల మొత్తం చెల్లించకుండానే బీమా కంపెనీ గృహ రుణ మొత్తాన్ని చెల్లిస్తుంది. దీంతో అతని కుటుంబానిక ఆ ఇల్లు ఏ అటంకం లేకుండా దక్కుతుంది. భర్త సంపాదనపై ఆధారపడిన కుటుంబమైతే బీమా సదుపాయం లేకుంటే ఆ ఇల్లు అమ్మి ఇంటి రుణం తిరిగి చెల్లించాల్సి వచ్చేది.
దురదృష్టవశాత్తూ తనకేమైనా జరిగినా రుణ భారం కుటుంబసభ్యులపై పడకూడదు అనుకుంటే రుణ గ్రహీతలు తప్పనిసరిగా గృహ రుణంపై బీమా పాలసీని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఇంటి రుణానికి ప్రతి నెలా చెల్లించే వాయిదాతో పాటు అదనంగా బీమా ప్రీమియం వసూలు చేసి రుణానికి భరోసా కల్పిస్తుంటాయి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్ పేమెంట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి.
గృహరుణంపై బీమా ప్రీమియం ఎంత ?
అప్పు తీసుకునే వారి వయసు, రుణం తీసుకున్న మొత్తం, దానిని తిరిగి చెల్లించే కాలాన్ని బట్టి బీమా ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకి 35 ఏళ్ళ వ్యక్తి 10 లక్షల రూపాయల ఇంటి రుణం తీసుకుని 15 ఏళ్ళలో తిరిగి చెల్లించాలనుకుంటే 8.7% వడ్డీతో నెలకి రూ. 9,965 ఈ.ఎం.ఐ. చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి రుణాలు ఇప్పుడు 8.5శాతానికి తక్కువ ఏ బ్యాంకు ఇవ్వడం లేదు.
ఇంటి రుణ మొత్తానికి జీవిత బీమా పాలసీ కూడా తీసుకోవాలంటే బీమా ప్రీమియంను అదనపు రుణంగా బ్యాంకులే మంజూరు చేస్తాయి. ఈ బీమా ప్రీమియం వల్ల రుణ వాయిదా మొత్తం నెలకి దాదాపుగా రుణ మొత్తాన్ని బట్టి కనిష్టంగా 150-200 రూపాయలు ఉంటుంది. జుకు దాదాపు 5 నుంచి 7 రూపాయల ఖర్చుతో పది లక్షల రూపాయల రుణానికి బీమా కవరేజి పొందే అవకాశం ఉంటుందని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు. రుణం తీసుకునే వ్యక్తి వయసును బట్టి ప్రీమియం మొత్తం పెరుగుతుంది.
బీమా కవరేజీకి ఎంత పరిమితి?
ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని వాయిదాల ప్రకారం సక్రమంగా కడితే ఏ నెలలో ఎంత అప్పు ఉండాలో అంత మొత్తానికి బీమా కవరేజి లభిస్తుంది. రూ. 10లక్షల అప్పును క్రమం తప్పకుండా కొన్నేళ్ళు చెల్లిస్తే రూ. 4లక్షల బాకీ ఉండగా రుణ గ్రహీతకు ఏదైనా జరిగితే బీమా కంపెనీ మిగిలిన రుణాన్ని తిరిగి చెల్లిస్తాయి. రుణ గ్రహీత చెల్లించిన ఈఎంఐలో ఏదైనా అదనంగా చెల్లించి ఉంటే దానిని నామినీకి చెల్లిస్తారు.
గృహ రుణంపై ప్రీమియం భారం కాదు…
బీమా ప్రీమియం చెల్లింపును భారంగా భావించకూడదు. ఈఎంఐతో అదనంగా కట్టే మొత్తాన్ని బీమా ఖర్చుగా పరిగణించాలి. బీమా పరిహారం చెల్లింపు అవసరమైతే రుణగ్రహీత చెల్లించే దానితో పోలిస్తే చాలా ఎక్కువే బీమా కంపెనీలు పరిహారంగా చెల్లిస్తుంటాయి. మియం కోసం ప్రతి నెలా చెల్లించిన మొత్తాన్నే ఖర్చుగా భావించాలి తప్ప బాంకు ముందుగా చెల్లించిన మొత్తాన్ని వృధా అనుకోకూడదు.
చాలామంది తమకు ఇతర బీమా పాలసీలున్నాయి. ప్రత్యేకంగా ఇంటి రుణ బీమా పాలసీ ఎందుకని" అనుకుంటారు. వ్యక్తిగత జీవిత విలువకు తగిన బీమా పాలసీ మీరు చేయించి ఉంటే ఇంటి రుణ పాలసీ లేకున్నా ఇబ్బంది ఉండదు. చాలామందికి జీవిత విలువకి తగిన బీమా కవరేజి లేదంటే అతిశయోక్తి కాదు.