LPG cylinder price hike : గ్యాస్​ సిలిండర్​ ధర పెంపు.. నేటి నుంచే అమలు-domestic lpg cylinder price hiked by 50 from today check latest rates ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Domestic Lpg Cylinder Price Hiked By 50 From Today. Check Latest Rates

LPG cylinder price hike : గ్యాస్​ సిలిండర్​ ధర పెంపు.. నేటి నుంచే అమలు

Sharath Chitturi HT Telugu
Mar 01, 2023 08:25 AM IST

LPG cylinder price hiked : దేశంలో ఎల్​పీజీ సిలిండర్​ ధరలు పెరిగాయి. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

గ్యాస్​ సిలిండర్​ ధర పెంపు.. నేటి నుంచే అమలు
గ్యాస్​ సిలిండర్​ ధర పెంపు.. నేటి నుంచే అమలు (AFP)

LPG cylinder price hiked : దేశంలో సామాన్యులకు మరో షాక్​ తగిలింది! ఎల్​పీజీ సిలిండర్​ ధరలు పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్​ గ్యాస్​ సిలిండర్​పై రూ. 50 పెరిగింది. ఇక 19 కేజీల వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్​పై రూ. 350.50 పెరిగింది. తాజా రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

వివిధ ప్రాంతాల్లో ఇలా..

తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 19కేజీల ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ. 2,119.0కి చేరింది. ఇక 14.2 కేజీల సిలిండర్​ ధర రూ. 1103 నుంచి రూ. 1053కి పెరిగింది. ముంబైలో 14.2 కేజీల ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ. 1052.5 నుంచి 1102.5కి చేరింది. కోల్​కతాలో అది రూ. 1079 నుంచి రూ. 1129కి పెరిగింది. చెన్నైలో నిన్నటి వరకు రూ. 1068.50గా ఉన్న 14.2 కేజీల ఎల్​పీజీ సిలిండర్​ ధర ప్రస్తుతం రూ. 1118.5కి వెళ్లింది. హైదరాబాద్​లో 14.2 కేజీల ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ. 1,155కి చేరింది. విజయవాడ, వైజాగ్​లోనూ ఇవే రేట్లు ఉన్నాయి.

LPG cylinder price in Hyderabad : ఇక వాణిజ్య ఎల్​పీజీ సిలిండర్​ ధర కోల్​కతాలో రూ. 1870, ముంబైలో రూ. 2071.5, చెన్నైలో రూ. 2268గా ఉంది.

స్థానిక పన్నుల కారణంగా.. ఎల్​పీజీ సిలిండర్​ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్​పీజీ సిలిండర్​ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్​లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్​లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే.

ఏడాదిలో రెండోసారి..!

LPG cylinder price : ఎల్​పీజీ సిలిండర్​ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్​ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

WhatsApp channel