Domestic air passengers: ‘ఫస్ట్ చాయిస్.. ఫ్లైట్ జర్నీనే’-domestic air passengers cross pre covid levels reach 1 29 crore in dec 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Domestic Air Passengers Cross Pre-covid Levels, Reach 1.29 Crore In Dec 2022

Domestic air passengers: ‘ఫస్ట్ చాయిస్.. ఫ్లైట్ జర్నీనే’

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 10:31 PM IST

Domestic air passengers: దేశీయ విమాన ప్రయాణాల్లో భారత్ రికార్డు సృష్టించింది. విమాన ప్రయాణాలకే భారతీయులు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని దీనితో స్పష్టమైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

Domestic air passengers: కరోనా ప్రపంచ వ్యాప్తంగా వైమానిక రంగాన్ని భారీగా దెబ్బ తీసింది. నష్టాలను తట్టుకోలేక చిన్న స్థాయి వైమానిక సంస్థలు మూతపడ్డాయి. భారత్ లోనూ అదే పరిస్థితి. కరోనాతో, కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో విమాన యాన సంస్థలు భారీగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ తేరుకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Domestic air passengers: రికార్డు ప్రయాణాలు

కోవిడ్ 19 విపరిణామాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. విమానయాన రంగం కూడా మళ్లీ లాభాల బాట పడుతోంది. విదేశీ,దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, గత నెలలో, డిసెంబర్ 2022లో దేశీయ విమాన ప్రయాణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. కరోనా ముందునాటి దేశీయ విమాన ప్రయాణాల సంఖ్యను దాటేసింది. కోవిడ్ ముందు, అంటే సుమారు మార్చి 2020కన్నా ముందు, నెలవారీ అత్యధిక దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.26 కోట్లు. కానీ, గత నెలలో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.29 కోట్లుగా నమోదైంది. అంటే, కోవిడ్ ముందు నాటి సంఖ్యను దాటేసింది. విమానయాన రంగానికి ఇది శుభసూచకమని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

Domestic air passengers: వసతులు మాత్రం పెరగడం లేదు..

ప్రస్తుతం విమానయానాన్ని ఇబ్బంది పెడుతోంది విమానాశ్రయాల్ల సేవలు, సౌకర్యాల లేమి. భారీగా పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా విమానశ్రయాల్లో మౌలిక వసతులు పెరగడం లేదు. విమానశ్రయాల్లో రద్దీ, గందరగోళం, ప్రయాణీకులకు సరైన గైడెన్స్ లేని పరిస్థితులు సాధారణమవుతున్నాయి.

WhatsApp channel