పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా? ఈ డాక్యుమెంట్స్​ కచ్చితంగా ఇవ్వాలి..-documents required for personal loan in hyderabad see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా? ఈ డాక్యుమెంట్స్​ కచ్చితంగా ఇవ్వాలి..

పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా? ఈ డాక్యుమెంట్స్​ కచ్చితంగా ఇవ్వాలి..

Sharath Chitturi HT Telugu

డబ్బు అవసరాల కోసం పర్సనల్​ లోన్​కి ప్రయత్నిస్తున్నారా? మరి లోన్​కి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? దేశంలోని టాప్​ 3 బ్యాంకుల్లో పర్సనల్​ లోన్​ డాక్యుమెంట్ల రిక్వైర్మెంట్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పర్సనల్​ లోన్​కి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి?

పెరుగుతున్న అవసరాలు, సరిపోని జీతాల వల్ల ప్రజలు డబ్బుల కోసం వివిధ రకాల లోన్స్​ తీసుకుంటున్నారు. వీటిల్లో పర్సనల్​ లోన్​వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఈ తరహా రుణాలు సులభంగా లభిస్తుండటం ఇందుకు ఒక కారణం. మరి మీరు కూడా పర్సనల్​ లోన్​కి ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులు (హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంకు) పర్సనల్​ లోన్​ కోసం ఏ తరహా డాక్యుమెంట్లు అడుగుతున్నాయో, పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

పర్సనల్​ లోన్​ కోసం డాక్యుమెంట్లు..

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు..

ఎలిజిబులిటీ- ప్రైవేట్​ కంపెనీ, ప్రభుత్వ ఉద్యోగులు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు పర్సనల్​ లోన్​కి అర్హులు.

21ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయస్కులు పర్సనల్​ లోన్​కి అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుత కంపెనీలో ఒక ఏడాది, గరిష్ఠంగా రెండేళ్ల ఉద్యోగం ఉన్న వారు పర్సనల్​ లోన్​కి అర్హులు.

నెలవారీ ఆదాయం కనీసం రూ. 25వేలు ఉండాలి.

డాక్యుమెంట్లు- ఐడీ ప్రూఫ్​, అడ్రెస్​ ప్రూఫ్​ (పాస్​పోర్ట్​, ఓటర్​ ఐడీ, డ్రైవింగ్​ లైసెన్స్​, ఆధార్​ కార్డు కాపీ).

గత 3 నెలల బ్యాంకు స్టేట్​మెంట్​ (6 నెలల పాస్​బుక్​).

రెండు కొత్త సాలరీ స్లిప్​లు/ ఫామ్​ 16తో కూడిన సాలరీ సర్టిఫికేట్​.

యాక్సిస్​ బ్యాంక్​..

ఎలిజిబులిటీ- ఉద్యోగం ఉన్న వారు. (ప్రైవేట్​- ప్రభుత్వం)

21ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉండాలి. 60ఏళ్లు మించకూడదు.

నెలవారీ జీతం కనీసం రూ. 15వేలు ఉండాలి.

డాక్యుమెంట్లు- పూర్తిగా నింపిన అప్లికేషన్​ ఫామ్​.

సంబంధిత కేవైసీ డాక్యుమెంట్లు. పాస్​పోర్ట్​ లేదా డ్రైవింగ్​ లైసెన్స్​ లేదా ఆధార్​ కార్డు లేదా ఓటర్​ ఐడీ. సంతకం చేసిన పాస్​పోర్ట్​, ప్యాన్​ కార్డు. రెండు నెలల ప్లే స్లిప్​. రెండు నెలల బ్యాంకు స్టేట్​మెంట్​. 1 ఇయర్​ ఎంప్లాయిమెంట్​ ప్రూఫ్​.

సంతకం చేసిన లోన్​ అగ్రీమెంట్​, స్టాండింగ్​ ఇన్​స్ట్రక్షన్​ రిక్వెస్ట్​.

ఐసీఐసీఐ బ్యాంకు..

ఎలిజిబులిటీ- వయస్సు 20 నుంచి 58ఏళ్ల మధ్యలో ఉండాలి.

కనీసం రూ. 30వేల నెలవారీ జీతం ఉండాలి (ఉద్యోగం బట్టి, బ్యాంకు రిలేషన్​ బట్టి ఇది మారుతుంది.)

రెండేళ్ల కనీస వర్కింగ్​ ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి.

డాక్యుమెంట్లు- ఐడీ ప్రూఫ్​ (పాస్​పోర్ట్​, డ్రైవింగ2 లైసెన్స్​, ఓటర్​ ఐడీ, ఎన్​ఆర్​ఈజీఏ జాబ్​ కార్డు, ఆధార్​ కార్డుల్లో ఏదైనా ఒకటి).

గత మూడు నెలల బ్యాంకు స్టేట్​మెంట్​.

కనీసం ఒక నెల సాలరీ స్లిప్​.

పాస్​పోర్ట్​ సైజు ఫొటోలు.

(గమనిక- పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం