Best Family Cars : ఫ్యామిలీతో వెళ్లేందుకు ఈ కార్లు బెస్ట్.. కొనే ఆలోచన ఉంటే ఓ లుక్కేయండి!-do you want to purchase new car heres best family cars mahindra xuv700 and tata safari know price and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Family Cars : ఫ్యామిలీతో వెళ్లేందుకు ఈ కార్లు బెస్ట్.. కొనే ఆలోచన ఉంటే ఓ లుక్కేయండి!

Best Family Cars : ఫ్యామిలీతో వెళ్లేందుకు ఈ కార్లు బెస్ట్.. కొనే ఆలోచన ఉంటే ఓ లుక్కేయండి!

Anand Sai HT Telugu
Jan 12, 2025 05:30 PM IST

Best Family Cars : ఫ్యామిలీ కోసం బెస్ట్ కారు తీసుకోవాలనుకునేవారి కోసం మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద కుటుంబం కోసం కారు కొనాలనుకుంటే మహీంద్రా ఎక్స్‌యూవీ700, టాటా సఫారీ గురించి ఆలోచించవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700
మహీంద్రా ఎక్స్‌యూవీ 700

ఫ్యామిలీ కోసం కొత్త కారు కొనాలనే కోరిక దాదాపు అందరికీ ఉంటుంది. కానీ ఏది కొనాలో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి వారికి టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలు బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకుంటే ఇందులో ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి అమ్మకాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ కార్ల ధర, స్పెసిఫికేషన్లు చూద్దాం..

మహీంద్రా ఎక్స్‌యూవీ 700

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విషయానికొస్తే ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుండి రూ. 25.49 లక్షల మధ్య ఉంది. ఎంఎక్స్, ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5తో సహా వివిధ వేరియంట్‌లు ఉన్నాయి. ఇందులో 5, 6, 7 సీట్ల ఆప్షన్స్ ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ 2-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. 17 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది. ఇది ఎవరెస్ట్ వైట్, మిడ్నైట్ బ్లాక్, నాపోలి బ్లాక్ వంటి అనేక రంగులలో కూడా అందుబాటులో ఉంది.

ఈ కారు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీపరంగా ఇది 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరాను పొందుతుంది.

టాటా సఫారీ ఎస్‌యూవీ

టాటా సఫారీ ఎస్‌యూవీ కారు ధర రూ.15.49 లక్షల నుండి రూ.26.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇది స్మార్ట్, ప్యూర్ అండ్ అడ్వెంచర్‌తో సహా విభిన్న వేరియంట్‌ల ఆప్షన్స్ పొందుతుంది. ఇది 6 లేదా 7 సీట్లతో అందుబాటులో ఉంటుంది. కొత్త టాటా సఫారీ ఎస్‌యూవీ 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 170 పీఎస్ హార్స్ పవర్, 350 ఎన్ఎం గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. 16.3 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.

ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి వివిధ ఫీచర్లు ఉంటాయి. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), టీపీఎంఎస్(టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), రైడర్ సేఫ్టీ కోసం 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం