Free life insurance: మీ డెబిట్ కార్డుతో మీరు ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్ పొందవచ్చన్న విషయం మీకు తెలుసా? ప్రత్యేకంగా పాలసీ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీరు ఈ జీవిత బీమా సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, అన్ని బ్యాంకులు తాము ఇష్యూ చేసే డెబిట్ కార్డు (debit card)లకు ఈ ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించవు. అందువల్ల, మీకు ఖాతా ఉన్న బ్యాంక్ ఈ సదుపాయం కల్పిస్తుందో? లేదో? బ్యాంక్ శాఖ కు వెళ్లి కనుక్కోండి.
డెబిట్ కార్డు హోల్డర్ దురదృష్టవశాత్తూ మరణించినట్లయితే, ఆ వ్యక్తి నామినీ, నామినీని ప్రకటించనట్లయితే, చట్టబద్ధమైన వారసులు ఆ డెబిట్ కార్డు ద్వారా లభించే జీవిత బీమాను క్లెయిం చేసుకోవచ్చు. అయితే, ఈ క్లెయిం ప్రాసెస్ వేర్వేరు బ్యాంక్ లకు వేర్వేరుగా ఉంటుంది.
జీవిత బీమాను క్లెయిం చేయడంలో కింద పేర్కొన్న సాధారణ దశలు ఉంటాయి
మీ డెబిట్ కార్డ్ నుండి ఉచిత జీవిత బీమాను క్లెయిమ్ చేయడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది: