Home Loan Balance Transfer: హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ గురించి తెలుసా?.. చాలా ప్రయోజనాలున్నాయి..-do you know about home loan balance transfer get plenty of benefits with home loan balance transfer ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Home Loan Balance Transfer: హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ గురించి తెలుసా?.. చాలా ప్రయోజనాలున్నాయి..

Home Loan Balance Transfer: హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ గురించి తెలుసా?.. చాలా ప్రయోజనాలున్నాయి..

Sudarshan V HT Telugu
Nov 13, 2024 04:06 PM IST

Home Loan Balance Transfer: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా పలు బ్యాంక్ లు హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం అందిస్తున్నాయి. వేరే బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థలో ఉన్న మీ హోం లోన్ ను తక్కువ హోం లోన్ వడ్డీ రేటు ఉన్న బ్యాంక్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్
హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్

Home Loan Balance Transfer: ఎక్కువ వడ్డీ రేటు వద్ద హోం లోన్ తీసుకుని రెగ్యులర్ గా ఈఎంఐ చెల్లిస్తున్న వినియోగదారులు తమ హోంలోన్ ను తక్కవ వడ్డీ రేటు ఉన్న వేరే బ్యాంక్ కు మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. హోం లోన్‌ను ట్రాన్స్ ఫర్ చేయడం వల్ల సేవ్ చేయొచ్చో, అలాగే బ‌దిలీ చేసిన త‌రువాత ఈ మొత్తాన్ని వేరే విధానాల్లో పెట్టుబ‌డి పెడితే ఎంత ఆదా అవుతుందో అంచ‌నా వేయ‌వ‌చ్చు. హోం లోన్ బ‌దిలీ చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను అంచ‌నా వేయడానికి ముందుగా ఇలా చేయండి.

హోం లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్‌కు సంబంధించిన కీల‌క అంశాలు

1. ప్ర‌స్తుత బ్యాంక్ వ‌ద్ద ఉన్న మీ లోన్‌ లో మిగిలిన మొత్తం ఎంత ఉందో చూసుకోండి. మీరు రూ.5 ల‌క్ష‌ల నుండి రూ.2 కోట్ల వ‌ర‌కు మీ ప్ర‌స్తుత లోన్ మొత్తాన్ని ఎంచుకోవ‌చ్చు.

2. ప్ర‌స్తుత బ్యాంక్ వడ్డీ రేటుతో, ఇతర బ్యాంక్ లు అందించే వడ్డీ రేటును పోల్చి చూసుకోండి. సాధారణంగా ఇది 8% నుంచి 16 శాతం మ‌ధ్య ఉంటుంది.

3. మీ లోన్ మిగిలిన చెల్లింపు కాలాన్ని ఎంచుకోవాలి. ఇది 5 నుండి 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. దీనిని రిమైనింగ్ రీ పేమెంట్ టెర్మ్ అంటారు.

4. హోం లోన్ బ‌దిలీ చేయ‌డానికి సంబంధించిన ఖ‌ర్చుల‌ను, సాధార‌ణంగా ప్రాసెసింగ్ ఫీజు, ఇత‌ర ఛార్జీల‌ను లెక్కించుకోవ‌చ్చు. వీటిని బ‌దిలీ ఖ‌ర్చులు అంటారు.

5. బ‌దిలీ చేసిన త‌రువాత ఆదా అయిన మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్ వంటి వేరే మార్గాల్లో పెట్టుబ‌డిగా పెడ్తే వచ్చే ప్రయోజనాలను లెక్కించండి.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

  • బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇలా ఉంటాయి. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా మీరు త‌క్కువ ఈఎంఐతో హోం లోన్ చెల్లింపు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.
  • వ‌డ్డీ రేటు (bank interest rates) త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, వ‌డ్డీపై కూడిన మొత్తం కూడా త‌గ్గుతుంది. త‌ద్వారా మీరు త‌క్కువ వ‌డ్డీ భారం ఎదుర్కొవ‌చ్చు. ఈ ప్ర‌యోజ‌నాన్ని రిక‌రింగ్ డిపాజిట్‌ వంటి పెట్టుబడి సాధనాల్లో పెట్టుబ‌డి పెడితే, ఆ వ‌డ్డీ ద్వారా మ‌రింత ఆదా చేసుకోవ‌చ్చు.
  • వ‌డ్డీ రేటు త‌గ్గ‌డం వ‌ల్ల ఈఎంఐ త‌గ్గుతుంది. నెల‌వారీ ఈఎంఐ చెల్లింపులు ఈజీ అవుతుంది. మీ ఆదా మొత్తాన్ని ఆర్‌డీలో పెట్టుబ‌డి పెడితే అద‌న‌పు ఆదాయం ల‌భిస్తుంది.

- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు

-హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner