Muhurat Trading 2023 : నేడు ముహురత్​ ట్రేడింగ్​- ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే బెస్ట్​!-diwali muhurat trading 2023 today time and other details here ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Diwali Muhurat Trading 2023 Today: Time And Other Details Here

Muhurat Trading 2023 : నేడు ముహురత్​ ట్రేడింగ్​- ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే బెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Nov 12, 2023 09:43 AM IST

Muhurat Trading 2023 : స్టాక్​ మార్కెట్​లలో నేడు ముహురత్​ ట్రేడింగ్​ జరగనుంది. టైమింగ్స్​ ఏంటి? ఏ స్ట్రాటజీ అప్లై చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

నేడు ముహురత్​ ట్రేడింగ్
నేడు ముహురత్​ ట్రేడింగ్ (PIC:MADHU KAPPARATH)

Muhurat Trading 2023 : ముహురత్​ ట్రేడింగ్​ కోసం స్టాక్​ మార్కెట్​లు సన్నద్ధమవుతున్నాయి. దీపావళి అయినప్పటికీ.. నేడు ముహురత్​ ట్రేడింగ్​ కోసం దేశీయ సూచీలు ఒక గంట పాటు పనిచేస్తాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు ముహురత్​ ట్రేడింగ్​ సెషన్​ ఉంటుంది. మొదటి 15 నిమిషాలు.. ప్రీ-మార్కెట్​ సెషన్​గా పరిగణిస్తారు. అంటే.. 6:15 నుంచి 7:15 వరకు ట్రేడింగ్​ చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు

ముహురత్​ ట్రేడింగ్​ అంటే ఏంటి?

దీపావళి సందర్భంగా.. ప్రతియేటా ఈ ముహురత్​ ట్రేడింగ్​ని నిర్వహిస్తారు. ఈరోజు స్టాక్స్​ కొన్నా, ట్రేడింగ్​లో లాభాలు వచ్చినా.. ఏడాది పొడవునా మంచి ఫలితాలు వస్తాయని మదుపర్లు, ట్రేడర్ల నమ్మకం. అందుకే.. దీపావళికి సెలువు ఉన్నా.. ఒక గంట సేపు మాత్రం మార్కెట్​లు పనిచేస్తాయి. ఈ సెషన్​లో తీసుకున్న ట్రేడ్స్​.. చివరికి సెటిల్​ అయిపోతాయి.

Muhurat Trading 2023 time : గతేడాది.. అక్టోబర్​ 24 స్టాక్​ మార్కెట్​లో ముహురత్​ ట్రేడింగ్​ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు సెషన్​ జరిగింది.

ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే బెస్ట్​..!

సాధారణ ట్రేడింగ్​ సెషన్స్​తో పోల్చుకుంటే.. దీపావళి ముహురత్​ ట్రేడింగ్​లో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మదుపర్లు, ట్రేడర్లు.. భారీ మొత్తంలో ప్లాన్​ చేయకపోవడం బెటర్​ అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.

కానీ.. ముహురత్​ ట్రేడింగ్​లో కొత్త స్టాక్స్​ కొన్ని అయినా కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించాలని చెబుతున్నారు. అది కుదరకపోయినా.. అనేక బ్రోకరేజీ సంస్థలు.. ఇప్పటికే టాప్​ దీపావళి స్టాక్ పిక్స్​ని రిలీజ్​ చేశాయని, వాటిని చూసి, కొంత మొత్తంలో ఇన్​వెస్ట్​ చేసుకోవచ్చని అంటున్నారు.

Muhurat Trading history : "ముహురత్​ ట్రేడింగ్​ రోజు స్టాక్స్​ కొంటే లాభాలు వస్తాయని అందరు భావిస్తారు. కానీ స్టాక్స్​ కొనాలి కదా అని ఏది పడితే అది బై చేయకూడదు. ఫండమెంటల్స్​ స్ట్రాంగ్​గా ఉండాలి. అప్పుడే మంచి లాభాలు చూడొచ్చు," అని మాస్టర్​ట్రస్ట్​ ఎండీ హర్జీత్​ సింగ్​ అరోరా వెల్లడించారు.

అయితే.. ముహురత్​ ట్రేడింగ్​ రోజున ట్రేడింగ్​ చేయవద్దని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా బిగినర్స్​.. దూరంగా ఉండాలని చెబుతున్నారు. లాంగ్​ టర్మ్​ ఇన్​వెస్ట్​మెంట్​ కోసం ప్లాన్​ చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

ఇక ముహురత్​ ట్రేడింగ్​ తర్వాత.. స్టాక్​ మార్కెట్​లు సోమవారం యథాతథంగా పనిచేస్తాయి. కాకపోతే.. మంగళవారం సెలువు ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం