Diwali Muhurat trading 2023: దీపావళి ఆదివారం వస్తోంది; ముహూరత్ ట్రేడింగ్ ఉంటుందా?
Diwali 2023: దీపావళి పండుగ రోజు ఒక గంట పాటు మాత్రమే స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి. ఆ సమయంలోనే ముహూరత్ ట్రేడింగ్ (Diwali Muhurat trading) కు అవకాశం కల్పిస్తాయి.
Diwali Muhurat trading 2023: నవంబర్ 12వ తేదీన దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది.ముహూరత్ ట్రేడింగ్ కోసం స్టాక్ మార్కెట్లు ఆ రోజు ఒక గంట పాటు ఓపెన్ అవుతాయి.
ట్రెండింగ్ వార్తలు
సాయంత్రం 6.15 నుంచి..
దీపావళి రోజు, నవంబర్ 12వ తేదీన సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల పాటు ముహూరత్ ట్రేడింగ్ ఉంటుందని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. ప్రి మార్కెట్ సెషన్ గా ఉండే 15 నిమిషాలు కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశాయి. నవంబర్ 12వ తేదీ ఆదివారం వస్తోంది. సాధారణంగా ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు. కానీ దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ (Diwali Muhurat trading) కోసం ఆ రోజు గంట పాటు స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. దీపావళి రోజు కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం శుభప్రదమని మదుపర్లు విశ్వసిస్తారు. ఆ రోజు ముహూరత్ ట్రేడింగ్ సమయంలో సంప్రదాయంగా కొన్ని స్టాక్స్ ను కొనుగోలు చేయడం లేదా అమ్మడం చేస్తారు. కొత్తగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కూడా దీపావళి ముహూరత్ ట్రేడింగ్ నుంచే ఆ పని ప్రారంభిస్తారు. ముహూరత్ ట్రేడింగ్ లో లాభం వస్తే సంవత్సరం అంతా లాభాలు వస్తాయని విశ్వసిస్తారు.
Vikram Samvat 2080: విక్రమ్ సంవత్ 2080
ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఈక్విటీ, కమాడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ సెగ్మెంట్లలో లావాదేవీలు జరపవచ్చు. ఈ దీపావళి నుంచి విక్రమ్ సంవత్ 2080 (Vikram Samvat 2080) ప్రారంభమవుతుంది.