Diwali Muhurat trading: ముహూరత్ ట్రేడింగ్‌లో లాభాల జోరు-diwali muhurat trading 2022 live updates in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali Muhurat Trading: ముహూరత్ ట్రేడింగ్‌లో లాభాల జోరు

Diwali Muhurat trading: ముహూరత్ ట్రేడింగ్‌లో లాభాల జోరు

Diwali Muhurat trading: దివాళీ ముహూరత్ ట్రేడింగ్ ఈ సాయంత్రం భారీ లాభాల్లో ప్రారంభమైంది.

సాయంత్రం 6.15 నుంచి 7.15 వరకు ముహురత్ ట్రేడింగ్ (MINT_PRINT)

Diwali Muhurat trading: సంవత్ 2079 ప్రారంభమైంది. సాయంత్రం 6.15 నుంచి గంట పాటు సాగే దివాళీ ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిప్టీ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్ 659 పాయింట్లు లాభపడి 59,954 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 193.80 పాయింట్లు లాభపడి 17,770 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Top gainers on Muhurat 2022: టాప్ గెయినర్స్ జాబితా..

ముహూరత్ ట్రేడింగ్‌లో లాభపడిన స్టాక్స్ జాబితాలో లార్సెన్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, ఐటీసీ, ఎం అండ్ ఎం, టీసీఎస్, తదితర స్టాక్స్ ఉన్నాయి.

Top losers on Muhurat 2022: టాప్ లూజర్స్ జాబితా..

ముహూరత్ ట్రేడింగ్ 2022 రోజు నష్టపోయిన స్టాక్స్ జాబితాలో హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ తదితర స్టాక్స్ ఉన్నాయి.

సంవత్ అంటే సంవత్సరం. దీపావళి నుంచి మరుసటి దీపావళి వరకు సంవత్సర కాలాన్ని సంవత్‌గా పరిగణిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో సాగే ముహురత్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే కలిసొస్తుందని మదుపరుల నమ్మకం. మన క్యాలెండర్‌తో పోలిస్తే సంవత్ 56.7 సంవత్సరాలు అడ్వాన్స్‌గా ఉంటుంది.

ముహూరత్ ట్రేడింగ్‌కు ముందు శుక్రవారం సెన్సెక్స్ 496.87 పాయింట్లు లాభపడి 59,804.02 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 160.05 పాయింట్లు లాభపడి 17,736 పాయింట్ల వద్ద ముగిసింది.