Diwali Muhurat trading : ముహురత్​ ట్రేడింగ్​ 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..!-diwali muhurat trading 2022 4 stocks to buy today 24th october ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali Muhurat Trading : ముహురత్​ ట్రేడింగ్​ 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..!

Diwali Muhurat trading : ముహురత్​ ట్రేడింగ్​ 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 24, 2022 08:04 AM IST

Diwali Muhurat trading 2022 : ముహురత్​ ట్రేడింగ్​ వేళ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు సూచించారు. ఆ వివరాలు..

ముహురత్​ ట్రేడింగ్​ 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..!
ముహురత్​ ట్రేడింగ్​ 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..!

Diwali Muhurat trading 2022 : అంతర్జాతీయంగా ఒడుదొడుకులు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు గత వారం వరుసగా ఆరు రోజులు లాభాల్లో ముగిశాయి. గత ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ 12 పాయింట్లు వృద్ధి చెంది 17,576 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​.. 104 పాయింట్ల లాభంతో 59,307 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ 1.71శాతం లాభపడింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం నిఫ్టీ కీలక పాయింట్​ వద్ద ఉంది. 17,600 దాటితే 18,000 వరకు అప్​ట్రెండ్​ చూడవచ్చు. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గా ఉంది. ముఖ్యమైన సపోర్టులు బ్రేక్​ చేస్తే తప్ప.. మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గుచూపవచ్చు. కానీ ట్రేడింగ్​ కోసం ఎంపిక చేసుకునే స్టాక్స్​పై అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ముహురత్​ ట్రేడింగ్​..

దీపావళి సందర్భంగా సోమవారం ముహురత్​ ట్రేడింగ్​ ఉంటుంది. ఈక్విటీ, డెరివేటివ్​ సెగ్మెంట్​లు సాయంత్రం 6:15 నుంచి ప్రారంభమవుతుంది. గంట తర్వాత 7:15తో ముగుస్తుంది. అయితే.. 6-6:08 వరకు ప్రీ మార్కెట్​ సెషన్​ ఉంటుంది.

ముహురత్​ ట్రేడింగ్​తో కొత్త 'సంవత్​' ప్రారంభమవుతుంది. భారత దేశ పురాణాల ప్రకారం.. సంవత్​ రోజు నుంచి కొత్త క్యాలెండర్​ మొదలవుతుంది. సాధారణ క్యాలెండర్​ కన్నా ఈ సంవత్​ క్యాలెండర్​ 56.7ఏళ్లు ముందు ఉంటుంది. అందుకే ఈసారి 2079 సంవత్​ వస్తోంది. ఈరోజున ఏదైనా మంచి పని చేస్తే అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. అందుకే.. సంవత్​ రోజున వ్యాపారులు తమ అకౌంట్​ బుక్స్​ను తీస్తారు.

what is Muhurat trading : దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు రావాలని ప్రార్థిస్తారు. ట్రేడింగ్​లో కూడా ఇంతే! అందుకే.. ముహురత్​ ట్రేడింగ్​కు ముందు.. లక్ష్మీదేవికి పూజలు చేసి, స్టాక్స్​ కొంటూ ఉంటారు.

బీఎస్​ఈలో ముహురత్​ ట్రేడింగ్​ ఆనవాయితీ 1957లో మొదలైంది. ఇక ఎన్​ఎస్​ఈలో 1992 నుంచి ముహురత్​ ట్రేడింగ్​ జరుగుతోంది.

ముహురత్​ ట్రేడింగ్​ స్టాక్స్​ టు బై లిస్ట్​..

Muhurat trading stocks o సుజ్లాన్​ ఎనర్జీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 6.50, టార్గెట్​ రూ. 11

ఎలక్ట్రానిక్​ మార్ట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ.80, టార్గెట్​ రూ 102.

కొటాక్​ మాహీంద్ర బ్యాంక్​:- బై రూ. 1880- 1890, స్టాప్​ లాస్​ రూ. 1870, టార్గెట్​ రూ. 1940- 1980

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​:- బై రూ. 40, స్టాప్​ లాస్​ రూ. 38.50, టార్గెట్​ రూ. 50

మంగళవారం నుంచి స్టాక్​ మార్కెట్లు సాధారణ టైమింగ్స్​లోనే పనిచేస్తాయి. అయితే బుధవారం మాత్రం స్టాక్​ మార్కెట్లకు సెలవు ఉంటుంది.

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు సొంత ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం