Flight ticket discounts : విమాన సంస్థల 'డిస్కౌంట్స్​' జాతర- టికెట్​ రేట్లు భారీగా దిగొచ్చాయి..!-diwali flight sale air india offers festive discounts for tickets details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flight Ticket Discounts : విమాన సంస్థల 'డిస్కౌంట్స్​' జాతర- టికెట్​ రేట్లు భారీగా దిగొచ్చాయి..!

Flight ticket discounts : విమాన సంస్థల 'డిస్కౌంట్స్​' జాతర- టికెట్​ రేట్లు భారీగా దిగొచ్చాయి..!

Sharath Chitturi HT Telugu

Diwali flight sale : ఎయిరిండియా వంటి ఏవియేషన్ ఆపరేటర్లు దీపావళి ఫ్లైట్ సేల్​లో చేరాయి. 2024 పండుగ సీజన్ కోసం విమాన ఛార్జీల తగ్గింపును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

భారిగా తగ్గిని విమాన టికెట్​ ధరలు- బుకింగ్స్​కి ఇదే రైట్​ టైమ్​! (HT Photo)

ఎయిర్​ ఇండియా వంటి దేశీయ విమానయాన ఆపరేటర్లు దీపావళి ఫ్లైట్ సేల్​ని ప్రారంభించాయి. 2024 పండుగ సీజన్ కోసం విమాన ఛార్జీల తగ్గింపును అందిస్తున్నాయి. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా వినియోగదారులను ఆకర్షించడానికి పోటీ ధరలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. 

ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ ఆదివారం ప్రచురించిన నివేదిక ప్రకారం.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ దీపావళి సీజన్లో అనేక దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు దాదాపు 20 నుండి 25 శాతం తగ్గాయి. విమానయాన సంస్థల సామర్థ్యం పెరగడం, ఇటీవల చమురు ధరలు తగ్గడం ఈ పండుగ సీజన్​లో విమాన ఛార్జీలు దిగిరావడానికి కారణమని న్యూస్​ ఏజెన్సీ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమాన కంపెనీ ఎయిర్​ ఇండియా ఇస్తున్న ఆఫర్స్​ గురించి ఇక్కడ తెలుసుకుందాము..

ఎయిర్​ ఇండియా ఆఫర్స్​..

ఫుల్ సర్వీస్ ఆపరేటర్ ఎయిర్ ఇండియా తమ పండుగల సీజన్​ను ప్లాన్ చేసుకోవడానికి ప్రయాణికుల కోసం ప్రత్యేక విమాన ఛార్జీలను అందిస్తోంది. అక్టోబర్ 8 నుంచి 14వ తేదీ వరకు సింగపూర్​కు వన్ వే ఫ్లైట్ టికెట్లు రూ.7,445 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెబ్ సైట్ తెలిపింది.

దీపావళి పండుగను కవర్ చేయడానికి ఎయిర్​ ఇండియా ఈ ఆఫర్​ని ప్రారంభించింది. కాబట్టి ఈ ఆఫర్ కింద అక్టోబర్ 8 నుంచి నవంబర్ 30 మధ్య ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

సింగపూర్ నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ఈ ఎయిర్​లైన్స్ ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడు 500 అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.32,231)కు టికెట్లు పొందొచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 14 వరకు బుకింగ్ కోసం వర్తిస్తుంది. మార్చి 20, 2025 వరకు ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది.

సౌదీ అరేబియాలోని రియాద్, జెడ్డాలకు ఎయిర్​ ఇండియా ట్రావెల్ డీల్స్ అందిస్తోంది. మార్చి 20, 2025 వరకు ప్రయాణానికి నవంబర్ 17 వరకు రూ.32,611కే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దిల్లీ, ముంబై విమానాశ్రయాల నుంచి వచ్చే ప్రయాణికులకు బిజినెస్ క్లాస్​లో 10 శాతం, ఎకానమీ క్లాస్​లో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

నవంబర్ 30 వరకు చెల్లుబాటు అయ్యే వన్ వే డొమెస్టిక్ ఫ్లైట్స్​లో ఒక్కో ప్రయాణికుడికి రూ.200 ఇన్​స్టంట్ డిస్కౌంట్​ను ఎయిర్ ఇండియా అందిస్తోంది.

సాధారణ బ్యాంక్ అనుబంధ ఆఫర్లతో పాటు ఈ పండుగ సీజన్​లో ఎయిర్​లైన్స్​ నుంచి ఇతర ఆఫర్లు ఈఎంఐ చెల్లింపులపై తక్షణ పొదుపు, నెట్ బ్యాంకింగ్​తో సేవింగ్స్​, యూపీఐ చెల్లింపులపై తక్షణ పొదుపు వంటివి ఉన్నాయి.

విస్తారా ఆఫర్లు..

ఈ కథనాన్ని ప్రచురించే నాటికి, విస్తారా వెబ్​సైట్​లో ఆఫర్లు కనిపించలేదు. అయితే, ఎయిర్ ఇండియా-విస్తారా విలీనం కారణంగా, ఎయిర్​లైన్స్ నవంబర్​లో కార్యకలాపాలను నిలిపివేస్తుంది.

ఇండిగో ఆఫర్..

ఇండిగో రూ.1,111 నుంచి ప్రారంభమయ్యే విమానాలకు సెప్టెంబర్ 30 వరకు డీల్స్​ను ఆఫర్ చేసింది. వెబ్​సైట్​ ప్రకారం, దీపావళి పండుగ కోసం ఇండిగో ఇంకా మరే ఇతర ముఖ్యమైన ఆఫర్​ని ప్రకటించలేదు.

ఇండిగో వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ నుంచి డైరెక్ట్ బుకింగ్స్​పై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని వెబ్సైట్​లో స్టాండర్డ్ ఆఫర్ పేర్కొంది. డైరెక్ట్ బుకింగ్ ఆఫర్​తో పాటు క్యాష్​బ్యాక్​ ఆఫర్లు, ఇతర బ్యాంక్ అనుబంధ ఆఫర్లను కూడా ఇస్తున్నట్టు కంపెనీ వెబ్సైట్ తెలిపింది.

ఖతార్​ ఎయిర్​వేస్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఈ దీపావళిని పండుగ ఛార్జీలతో జరుపుకోవడానికి బిజినెస్ క్లాస్ ప్రయాణాలపై 25 శాతం, ఎకానమీ క్లాస్ ప్రయాణాలపై 20 శాతం తగ్గింపును ఆఫర్ చేశాయి.

ఈ రూట్లలో తగ్గింపు ఎక్కువ..

ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. బెంగళూరు నుంచి కోల్​కతాకు విమాన ఛార్జీలు గరిష్టంగా రూ.10,195 నుంచి రూ.6,319కు తగ్గాయి.

చెన్నై నుంచి కోల్​కతా మార్గంలో విమాన ఛార్జీలు 36 శాతం తగ్గి రూ.8,725 నుంచి రూ.5,604కు పడ్డాయి.

ముంబై- దిల్లీ మార్గంలో విమాన ఛార్జీలు 34 శాతం తగ్గి రూ.8,788 నుంచి రూ.5,762కు చేరాయి. దిల్లీ-ఉదయ్​పూర్​ మార్గంలో విమాన ఛార్జీలు 34 శాతం తగ్గి రూ.11,296 నుంచి రూ.7,469కి పడిపోయాయి.

దిల్లీ నుంచి కోల్​కతా, హైదరాబాద్ నుంచి దిల్లీ, దిల్లీ నుంచి శ్రీనగర్ మార్గాల్లో విమాన చార్జీలు 32 శాతం తగ్గాయి.

సంబంధిత కథనం