Google Pay Cashback : మీకు గూగుల్ పే ఉంటే.. ఇలా చేస్తే రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు
Google Pay Cashback : దీపావళి పండుగ కావడంతో కంపెనీలు వివిధ రకాలుగా కస్టమర్లను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో గూగుల్ పే కూడా ఉంది. గూగుల్ పే తాజా ప్రచారంలో మీరు వెయ్యి రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.
దీపావళి వేడుకలు దేశంలో మెుదలయ్యాయి. అక్టోబర్ 29న దేశం ధంతేరాస్ జరుపుకొంటోంది. 31న దీపావళి వేడుకలకు చాలా మంది సిద్ధమయ్యారు. పండుగ కావడంతో కంపెనీలు వివిధ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇటు ఆటోమెుబైల్స్ కంపెనీలు, స్మార్ట్ ఫోన్ కంపెనీలు డిస్కౌంట్స్ ప్రకటించి కస్టమర్లకు దగ్గరవుతున్నాయి. దీపావళి నేపథ్యంలో గూగుల్ పే కూడా వినూత్నంగా క్యాంపెయిన్ మెుదలుపెట్టింది.
ఇది వినియోగదారులు రూ. 1,001 వరకు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. గూగుల్ పే 'లడ్డూస్' ప్రచారంలో రివార్డ్‌లను గెలుచుకోవచ్చు. నవంబర్ 7లోపు ఆరు ప్రత్యేకమైన లడ్డూస్ కార్డ్‌లను సేకరించాలి. ఇందులో పాల్గొనడానికి మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ని తెరవండి. రివార్డ్స్ ట్యాబ్‌కి వెళ్లి ఇక్కడ లడ్డూస్ విభాగాన్ని గుర్తించండి. ఇంతకుముందు చెప్పినట్టుగా గూగుల్ పే లడ్డూస్ కార్డ్‌లను గెలుచుకోవడానికి వినియోగదారులు పలు లావాదేవీలను పూర్తి చేయాలి.
ఈ కార్డ్‌లను గెలుచుకోవడానికి అర్హతలు
కనీసం రూ. 100 లావాదేవీతో వ్యాపారి వద్ద స్కాన్ చేసి చెల్లించండి.
కనీసం రూ. 100తో మొబైల్ రీఛార్జ్ చేయండి లేదా బిల్లు చెల్లించండి.
కనీసం రూ. 200 విలువైన గిఫ్ట్ కార్డ్‌ని కొనుగోలు చేయండి.
యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించండి.
గూగుల్ పే వినియోగదారులు వివిధ లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా కార్డ్‌ని గెలుచుకునే అవకాశాలను పెంచుకోవచ్చు. తమకు కార్డ్ పంపమని స్నేహితుడిని కూడా అభ్యర్థించవచ్చు. మీరు కూడా పంపవచ్చు. మొత్తం ఆరు గూగుల్ పే లడ్డూస్ కార్డ్‌లను సేకరించాలి. అప్పుడే మీరు దీనికి అర్హులు అవుతారు. తర్వాత కింద చెప్పే దశల ద్వారా రివార్డ్‌లను క్లెయిమ్ చేయవచ్చు.
ఇలా క్లెయిమ్ చేయండి
గూగుల్ పే యాప్‌కి వెళ్లండి
ఆఫర్‌లు, రివార్డ్‌లకు వెళ్లండి
ఇక్కడ, లడ్డూస్ అనే విభాగంపై క్లిక్ చేయండి
'ఫైనల్ రివార్డ్‌ను క్లెయిమ్ చేయండి'పై ప్రెస్ చేయాలి
మీరు రూ. 51 నుండి రూ. 1,001 క్యాష్‌బ్యాక్ మొత్తంతో స్క్రాచ్ కార్డ్‌ని పొందుతారు.