Diwali 2024 Picks : ఎస్బీఐ టూ ఐటీసీ.. దీపావళికి నిపుణులు సలహా ఇస్తున్న 5 స్టాక్స్ ఇవే
Diwali 2024 Picks : దీపావళి కోసం నిపుణులు పలు స్టాక్స్ కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ సూచిస్తున్న 5 స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూడండి.
దీపావళికి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని చాలా మంది అనుకుంటారు. ముహూరత్ ట్రేడింగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సమయంలో చాలా బ్రోకరేజి సంస్థలు కొనాల్సిన స్టాక్స్ గురించి సలహాలు ఇస్తున్నాయి. అందులో భాగంగా రెలిగేర్ బ్రోకింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్ కంపెనీ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, బెర్గర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్, జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ స్టాక్స్ కొనాలని చెబుతుంది. వాటిపై ఓ లుక్కేద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్‌ను దాదాపు రూ.782 వద్ద, రూ.941 టార్గెట్ ధరకు 20.3 శాతం అప్‌సైడ్‌తో కొనుగోలు చేయాలని బ్రోకరేజి సంస్థ సిఫార్సు చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ లోన్ టు డిపాజిట్ నిష్పత్తితో మంచి స్థానంలో ఉంది. స్థిరమైన 22-23 శాతం క్రెడిట్ మార్కెట్ మంచి వాటాను పొందేందుకు వీలు కల్పిస్తుంది. సాంకేతిక పెట్టుబడులు వ్యయ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. ఈ అంశాల ఆధారంగా రెలిగేర్ సంస్థ FY24-26 కంటే CAGR 14.2 శాతం, 7 శాతం వద్ద నికర వడ్డీ ఆదాయం, నికర లాభం వృద్ధిని ఆశిస్తోంది. దీంతో ఎస్బీఐపై ఇన్వెస్ట్ చేయాలని చెబుతోంది.
టైటాన్ కంపెనీ లిమిటెడ్
టైటాన్ స్టాక్‌ను రూ.3271 వద్ద కొనుగోలు చేయాలని సిఫార్సు చేసింది. టార్గెట్ ధర రూ.4270కి 30.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది
తనిష్క్, మియ, జోయ, Caratlane వంటి బ్రాండ్‌ల ద్వారా టైటాన్ జ్యువెలరీ పరిశ్రమలో మంచి స్థానంలో ఉంది. మొత్తం మార్కెట్ వాటాను 8 శాతం కలిగి ఉంది. బంగారం దిగుమతులపై కస్టమ్ డ్యూటీని తగ్గించడం దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉంటుంది. కంపెనీ వాచీలు, ఐ-కేర్, ఎమర్జింగ్ బిజినెస్ వంటి విభాగాల్లో ముందుంది. FY24-26 రాబడి, నికర లాభం వరుసగా 21.5 శాతం మరియు 28.9 శాతం CAGR వద్ద పెరుగుతుందని అంచనా.
బెర్గర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్
బెర్గర్‌ను రూ.655 టార్గెట్ ధరతో రూ.537 వద్ద కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది 22 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
బెర్గర్ పెయింట్స్ మంచి పనితీరును ప్రదర్శించింది. పోటీదారులలో అత్యధిక మార్కెట్ వాటాను సాధించింది. స్థిరమైన డిమాండ్, ఆవిష్కరణలు, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీలో విస్తరణతో కంపెనీ వృద్ధికి సహాయపడతాయి. రాబడి, నికర లాభం FY24-26 13 శాతం, 15.9 శాతం వద్ద పెరుగుతాయని అంచనా వేసింది.
జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్
జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్‌ని దాదాపు రూ.487 వద్ద రూ.624 టార్గెట్ ధరకు కొనుగోలు చేయాలని రేలిగెర్ చెబుతోంది. 28.1 శాతం వృద్ధిని ఆశిస్తుంది.
కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం, ప్రకటనలు, ప్రచార కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టి మార్కెట్ వాటాను పొందడం ద్వారా జ్యోతి ల్యాబ్స్ చాలా ముందుకు వచ్చిందని రెలిగేర్ అభిప్రాయపడింది. బ్రాండ్ బిల్డింగ్ కార్యక్రమాలతోపాటుగా ఇతర విషయాలపై ఆసక్తిగా ఉన్నారని తెలిపింది. FY24-26లో ఆదాయం, నికర లాభం వరుసగా 15.7 శాతం, 17.3 శాతం వద్ద పెరుగుతాయని అంచనా వేసింది.
ఐటీసీ లిమిటెడ్
23.2 శాతం అప్‌సైడ్‌తో రూ.594 టార్గెట్ ధరకు, రూ.482 వద్ద ఐటీసీ కొనుగోలు చేయాలని బ్రోకరేజి సంస్థ సిఫార్సు చేసింది.
ఐటీసీ లిమిటెడ్ సిగరెట్లు, FMCG, హోటళ్లు, అగ్రి-బిజినెస్‌లలో రాణిస్తూ భారతదేశంలో మంచి గుర్తింపు ఉంది. ITC నెక్స్ట్ ప్రణాళిలతో వృద్ధిని సాధిస్తుంది. వివిధ కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం, పంపిణీని మెరుగుపరచడం ద్వారా ఐటీసీ తన ప్రధాన వ్యాపారాలను బలోపేతం చేస్తోంది. రెలిగేర్ సంస్థ ఐటీసీ ఆదాయం, నికర లాభ వృద్ధిని FY24-26లో వరుసగా 12.7 శాతం, 13.8 శాతంగా అంచనా వేసింది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. నిపుణుల అభిప్రాయం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది.