Diwali 2023: ‘సంవత్’ అంటే ఏమిటి? ఇన్వెస్టర్లకు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్?
Diwali 2023: ప్రతీ సంవత్సరం దీపావళి నుంచి కొత్త ‘సంవత్ (samvat)’ ప్రారంభమవుతుంది. సంవత్ అంటే సంవత్సరం. అంటే విక్రమ నామ హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
Diwali 2023: సాధారణంగా దీపావళి పండుగను ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండు రోజులు ధన త్రయోదశి (Dhanteras) తో ప్రారంభమై.. భాయి దూజ్ (bhai dooj) తో ముగుస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
సంవత్ 2080
ఈ పండుగ రోజుల్లో దీపావళి రోజున కొత్త సంవత్ (samvat) ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం దీపావళి రోజున సంవత్ 2079 ముగిసి, సంవత్ 2080 ప్రారంభమవుతుంది. ప్రతీ సంవత్సరం ఈ సంవత్ రోజు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యమైన, పవిత్రమైన రోజు. ఈ రోజు పండుగ రోజైనా సరే.. స్టాక్ మార్కెట్లను ప్రత్యేకంగా ఒక గంట పాటు ఓపెన్ చేస్తారు. ఆ గంట సమయం చాలా పవిత్రమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తారు. ఆ సమయాన్ని ముహూరత్ ట్రేడింగ్ (Muhurat trading) గా పిలుస్తారు. ఆ సమయంలో, తమ గత పెట్టుబడులను సమీక్షించుకోవడం, కొత్తగా పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు. వ్యాపారులు కూడా తమ కొత్త ఖాతా పుస్తకాలను ఆ సమయంలో ప్రారంభిస్తారు.
సాయంత్రం 6.15 గంటల నుంచి
ఈ సంవత్సరం ముహూరత్ ట్రేడింగ్ (Muhurat trading) ఆదివారం, నవంబర్ 12వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు ఉంటుంది. ఈ ముహూరత్ ట్రేడింగ్ ను ట్రేడర్లు, ఇన్వెస్టర్లు చాలా పవిత్రంగా భావిస్తారు. గత పది సంవత్సరాల ముహూరత్ ట్రేడింగ్ లలో ఏడు పర్యాయాలు మార్కెట్లు లాభాలతో ముగియడం గమనార్హం. విక్రమ్ సంవత్ (Vikram Samvat) క్యాలెండర్ విక్రమాదిత్య రాజు పేరుపై వచ్చింది. నేపాల్ లో ఇది అధికారిక క్యాలెండర్. భారత్ లో హిందువులు, సిక్కులు ఈ క్యాలెండర్ ను ఫాలో అవుతారు.