Diwali 2023 stock picks: దీపావళి రోజు ఈ 6 స్టాక్స్ కొంటే లాభాలు గ్యారెంటీ
Diwali 2023 stocks: ఈ సంవత్సరం దీపావళి రోజు కొనుగోలు చేయడానికి బొనాంజా పోర్ట్‌ఫోలియో 6 స్టాక్స్ ను సిఫార్సు చేసింది. అవి KPIT టెక్నాలజీస్, MAS ఫైనాన్షియల్ సర్వీసెస్, V-గార్డ్ ఇండస్ట్రీస్, వేదాంత్ ఫ్యాషన్, TVS మోటార్ కంపెనీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
Diwali 2023 stock picks: దీపావళి రోజు ముహూరత్ ట్రేడింగ్ సమయంలో కొత్త స్టాక్స్ (Diwali 2023 stocks to buy) ను కొనడం శుభప్రదమని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. భవిష్యత్తులో భారీ లాభాలను ఇచ్చే స్టాక్స్ కోసం వారు చూస్తుంటారు. వారి కోసం బొనాంజా పోర్ట్ ఫొలియో (Bonanza Portfolio) సంస్థ ఆరు స్టాక్స్ ను సూచిస్తోంది. సమీప భవిష్యత్తులో అవి కచ్చితంగా మంచి రిటర్న్స్ ను ఇస్తాయని చెబుతోంది.
కేపీఐటీ టెక్నాలజీస్
ప్రస్తుత ధర రూ. 1,315, టార్గెట్ ధర రూ. 1,462.
ఈవీ, కనెక్టివిటీ, ఐఓటీ లపై అన్ని కంపెనీలు దృష్టి కేంద్రీకరిస్తున్నందున.. కేపీఐటీ టెక్నాలజీస్ స్టాక్స్ భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ను సాధించే అవకాశం ఉంది. ఈ సంస్థ OEMల కోసం వివిధ సాంకేతికతలలో భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ రంగంలో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉంది. EVపై ప్రత్యేకించి US, యూరప్‌లలో ఈవీలకు పెరిగిన ప్రాధాన్యం ఈ సంస్థకు కలిసి రానుంది.
ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ప్రస్తుత ధర రూ. 900, టార్గెట్ ధర రూ. 1,050.
ఎంఏఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం రూ. 900 వద్ద ట్రేడ్ అవుతోంది. సంస్థకు ఉన్న బలమైన నెట్ వర్క్, స్ట్రాంగ్ క్రెడిట్ పాలసీల కారణంగా సమీప భవిష్యత్తులో ఇది మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. 2025 నాటికి ఈ స్టాక్ ధర కనీసం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
వీ గార్డ్ ఇండస్ట్రీస్
ప్రస్తుత ధర రూ. 285, టార్గెట్ ధర రూ. 371.
ఈ స్టాక్ ప్రస్తుతం రూ. 285 వద్ద ట్రేడవుతోంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో వీ గార్డ్ బలమైన స్థానంలో ఉంది. భవిష్యత్ ప్రణాళికలు సంస్థ వృద్ధిని సూచిస్తున్నాయి. మార్కెట్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ, పోటీదారులతో పోలిస్తే, నాణ్యత, అందుబాటు ధరల కారణంగా వినియోగదారుల విశ్వాసం చూరగొంటోంది. అందువల్ల ఈ కంపెనీ స్టాక్ సమీప భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జించగలదు.
వేదాంత్ ఫ్యాషన్
ప్రస్తుత ధర రూ. 1,334, టార్గెట్ ధర రూ.1528.
రానున్న పెళ్లిళ్ల సీజన్, పండుగల సీజన్ కారణంగా సంస్థ సేల్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలోని వైవిధ్యం ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ను మరో స్థాయిలో నిలుపుతోంది. అస్సెట్ లైట్ - ఫ్రాంచైజీ మోడల్ కారణంగా నిర్వహణ ఖర్చులను సంస్థ బాగా నియంత్రిస్తోంది. అందువల్ల ఈ స్టాక్ భవిష్యత్తులో మంచి లాభాలను గడించే అవకాశం ఉంది.
టీవీఎస్ మోటార్ కంపెనీ
ప్రస్తుత ధర రూ. 1,647, టార్గెట్ ధర రూ.1920.
అన్ని సెగ్మెంట్ల వినియోగదారులను ఆకట్టుకునే బైక్, స్కూటర్ మోడల్స్ తో టీవీఎస్ మోటార్స్ మార్కెట్లోని పోటీదారులకు గట్టి పోటీని ఇస్తోంది. కరోనా అనంతర సానుకూల పరిస్థితుల నేపథ్యంలో టీవీఎస్ మోటార్స్ వాహనాల సేల్స్ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్, స్కూటర్స్ విభాగంలో ఈ కంపెనీ దూసుకుపోతోంది. ప్రస్తుత మార్కెట్లో స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు కొత్త మార్కెట్లను అన్వేషిష్తోంది.
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర
ప్రస్తుత ధర రూ. 43.40, టార్గెట్ ధర రూ.56.
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరంగా వృద్ధి సాధిస్తున్నబ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర. ఓవరాల్ గా అన్ని బ్యాంకింగ్ సెక్టార్లలో వృద్ధిని సాధిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్ అనువైన ధరలో లభిస్తోంది. సమీప భవిష్యత్తులో ఇది కనీసం 29% వృద్ధి సాధించగలదు.
సూచన: ఈ కథనంలోని సూచనలు మార్కెట్ నిపుణులు ఇచ్చినవి. హిందుస్తాన్ తెలుగుతో వీటికి సంబంధం లేదు. ఇన్వెస్టర్లు నిపుణులను సంప్రదించి స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.