మీరు సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? ఇటివలి కాలంలో పెరిగిపోతున్న టికెట్ ధరలకు విసుగెత్తిపోయారా? అయితే ఇది మీకోసమే! మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా సినిమా ఎక్స్‌పీరియెన్స్‌ని మిస్ అవ్వకుండా, టికెట్లపై మంచి మంచి డిస్కౌంట్లను పొందొచ్చు. వీటి వల్ల గణనీయంగా మీకు డబ్బులు ఆదా అవుతాయి కూడా! ఈ నేపథ్యంలో సినిమా టికెట్లపై డిస్కౌంట్ని అందించే పలు క్రెడిట్ కార్డు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డు: ఈ క్రెడిట్ కార్డుతో నెలకు రెండుసార్లు బుక్‌మైషో, ఐనాక్స్‌లో సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. గరిష్టంగా రూ.100 వరకు 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది తక్కువగానే అనిపించినా, కాలక్రమేనా మీరు సినిమాలు ఎక్కువగా చూసే వ్యక్తి అయితే, ఇది గణనీయమైన పొదుపుకు దోహదపడుతుంది.
2. ఆర్బీఎల్ బ్యాంక్ ప్లే క్రెడిట్ కార్డు: బుక్‌మైషోలో సినిమాలు, స్ట్రీమ్స్, ఈవెంట్లు, నాటకాలు, క్రీడలు, యాక్టివిటీస్ బుకింగ్లపై రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
3. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డు: ఈ కార్డు నెలవారీ పరిమితి రూ .100తో సినిమా టికెట్ కొనుగోలుపై 10 శాతం తగ్గింపును అందిస్తుంది.
4. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టైమ్స్ క్రెడిట్ కార్డు: బుక్ మై షో ద్వారా సినిమా టికెట్లపై 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఒక కార్డుదారుడు నెలకు గరిష్టంగా నాలుగు డిస్కౌంట్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు!
ఒక్కో లావాదేవీపై కార్డుదారుడు గరిష్టంగా రూ.350 డిస్కౌంట్ పొందవచ్చు. ఫుడ్ అండ్ బేవరేజెస్‌పై రూ.50 డిస్కౌంట్‌ను (ఒక్కసారి మాత్రమే) కూడా పొందవచ్చు.
అంతేకాదు, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్, ఎస్బీఐ ఇలైట్ క్రెడిట్ కార్డు వంటివి.. నెలవారీగా కొన్ని కండీషన్స్‌తో ఫ్రీ మూవీ టికెట్స్‌ని కూడా ఇస్తున్నాయి.
కాగా, కార్డుదారులు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో వార్షిక రుసుము వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ కార్డులపై ఇచ్చే ప్రయోజనాలను సంస్థలు ఇతర ఛార్జీల రూపంలో వసూలు చేస్తుంటే, ఇక మనకి ప్రయోజనం ఉండదు. అంతేకాదు, సినిమా టికెట్లపై డిస్కౌంట్‌కి సంబంధించి ఏవైనా షరతులు ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి.
సంబంధిత కథనం