Discounts on Maruti cars in november : మారుతీ వాహనాలపై అదిరిపోయే ఆఫర్స్​!-discounts on maruti cars in november 2022 up to rs 50 000 offered check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Discounts On Maruti Cars In November 2022, Up To <Span Class='webrupee'>₹</span>50,000 Offered Check Details

Discounts on Maruti cars in november : మారుతీ వాహనాలపై అదిరిపోయే ఆఫర్స్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 05, 2022 07:13 AM IST

Discounts on maruti cars in november 2022 : నవంబర్​లో కూడా ఆఫర్లు, డిస్కౌంట్ల జాతర నడుస్తోంది. మారుతీ సుజుకీ వాహనాలపై రూ. 50వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..

మారుతీ వాహనాలపై అదిరిపోయే ఆఫర్స్​!
మారుతీ వాహనాలపై అదిరిపోయే ఆఫర్స్​! (HT Auto)

Discounts on maruti cars in november 2022 : 'పండుగ సీజన్​ అయిపోయింది.. కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా మాయమైపోయాయి' అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే! పండుగ సీజన్​ జోష్​ను కొనసాగించేందుకు పలు ఆటో సంస్థలు.. నవంబర్​లోనూ భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. వీరిలో మారుతీ సుజుకీ ఒకటి. కొన్ని మారుతీ వాహనాలపై రూ. 50వేల వరకు ఆఫర్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

ట్రెండింగ్ వార్తలు

ఆల్టో 800..

Alto 800 discounts : ఆల్టో 800 పెట్రోల్​, సీఎన్​జీ వేరియంట్లపై క్యాష్​ డిస్కౌంట్​ రూ. 15వేల వరకు ఇస్తోంది మారుతీ సుజుకీ. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 15వేలు తగ్గిస్తోంది. ఇక కార్పొరేట్​ డిస్కౌంట్​ పేరుతో రూ.4వేలు తగ్గించింది. ఇవన్నీ కలుపుకుంటే ఆల్టో 800 ధర రూ. 34వేల వరకు తగ్గొచ్చు! ప్రస్తుతం మారుతీ ఆల్టో 800 ధర రూ. 3.39లక్షలు- రూ. 5.03లక్షల మధ్యలో ఉంది.

ఆల్టో కే10..

Alto K10 : ఆల్టో కే10పై మొత్తం మీద రూ. 50వేల వరకు బెనిఫిట్స్​ లభిస్తున్నాయి. క్యాష్​ బెనిఫిట్​లు.. ఒక్కో వేరియంట్​కు ఒక్కో విధంగా ఉన్నాయి. ఏఎంటీ వేరియంట్లకు బెనిఫిట్​లు లేవు. అన్ని వేరియంట్లపై ఎక్స్​ఛేంజ్​ బోనస్​ రూ.15వేలుగా ఉంది. సీఎన్​జీని మినహాయిస్తే.. కార్పొరేట్​ బెనిఫిట్స్​ విలువ రూ.5000గా ఉంది. మార్కెట్​లో ఆల్టో కే10 ధర రూ. 3.99లక్షలు- రూ. 5.83లక్షల మధ్యలో ఉంది.

ఎస్​- ప్రెస్సో..

S presso offers : మేన్యువల్​ టాప్​ వేరియంట్లు వీఎక్స్​ఐ, వీఎక్స్​ఐ ప్లస్​పై క్యాష్​ డిస్కౌంట్​ రూ. 30వేల వరకు ఉన్నాయి. స్టాండర్డ్​, ఎల్​ఎక్స్​ఐ, సీఎన్​జీ వేరియంట్లపై రూ. 20వేల వరకు క్యాష్​ బెనిఫిట్​​ లభిస్తోంది. ఏఎంటీ వేరియంట్​కు ఎలాంటి క్యాష్​ బెనిఫిట్​ లేదు. ఇక ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 15వేలు తగ్గుతుంది. ఏఎంటీ వేరియంట్లపై రూ. 19వేలు ఆదా చేసుకోవచ్చు. కార్పొరేట్​ డిస్కౌంట్​ పేరుతో మరో రూ. 4000 దిగొస్తుంది. సీఎన్​జీ వేరియంట్​కు కార్పొరేట్​ డిస్కౌంట్​ వర్తించడం లేదు. ప్రస్తుతం మారుతీ ఎస్​ ప్రెస్సో ధర రూ. 4.25లక్షలు- రూ.6.10 లక్షల మధ్యలో ఉంది.

వాగన్​ ఆర్​..

Wagon R price : 2 లీటర్​ మేన్యువల్​ సీఎన్​జీ వాగన్​ ఆర్​పై రూ. 20000 క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తుంటే.. మేన్యువల్​ ఎల్​ఎక్స్​ఐ, వీఎక్స్​ఐలపై అది రూ. 10వేలుగా ఉంది. ఆటోమెటిక్​కి క్యాష్​ బెనిఫిట్​లు లేవు. వాగన్​ ఆర్​పై ఎక్స్​ఛేంజ్​ బోనస్​ రూ. 15వేలుగా ఉంది. సీఎన్​జీని మినహాయిస్తే.. ఇతర వేరియంట్లపై రూ. 5వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ను ఇస్తోంది సంస్థ. మార్కెట్​లో ప్రస్తుతం వాగన్​ ఆర్​ ధర రూ. 5.47లక్షలు- 7.20 లక్షల మధ్యలో ఉంది.

సెలేరియో..

Celerio discounts : సెలేరియో బేసిక్​ మేన్యువల్​ ఎల్​ వేరియంట్​, సీఎన్​జీ వేరియంట్​పై క్యాష్​ డిస్కౌంట్​ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్​, జెడ్​ ప్లస్​ వేరియంట్లపై అది రూ. 25వేలుగా ఉంది. సీఎన్​జీ వేరియంట్​ను మినహాయిస్తే.. ఇతర వాటికి రూ. 4వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేలు ఇస్తున్నారు. ఏఎంటీ వర్షెన్​పై రూ. 19వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మార్కెట్​లో మారుతీ సెలేరియా ధర ప్రస్తుతం రూ. 5.25లక్షలు- 7లక్షల మధ్యలో ఉంది.

స్విఫ్ట్​..

discounts on Swift cars : స్విఫ్ట్​ ఏఎంటీ వర్షెన్​పై రూ. 15వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. మేన్యువల్​ వేరియంట్లపై అది రూ. 8వేలుగా ఉంది. అన్ని వేరియంట్లపై.. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేలు తగ్గుతుంది. కార్పొరేట్​ డిస్కౌంట్​ పేరుతో మరో రూ. 5వేలు తగ్గింపు ఉంటుంది. సీఎన్​జీ వేరియంట్లకు అసలు ఏ డిస్కౌంట్లు వర్తించడం లేదు. ప్రస్తుతం స్విఫ్ట్​ ధర రూ. 5.92లక్షలు- రూ. 8.885లక్షల మధ్యలో ఉంది.

డిజైర్​..

Offers on Maruti Dzire car : ఏఎంటీ వర్షెన్​కు మాత్రమే రూ. 15వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఏఎంటీ, మేన్యువల్​ వేరియంట్లపై రూ. 10వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​ నడుస్తోంది. కార్పొరేట్​ డిస్కౌంట్లు లేవు. సీఎన్​జీ వేరియంట్లకు అసలు ఎలాంటి ఆఫర్లు ఇవ్వడం లేదు. డిజైర్​ ధర రూ. 6.24లక్షలు-9.18లక్షల మధ్యలో ఉంది.

  • పైన చెప్పిన వాహనాల ధరలన్నీ ఎక్స్​షోరూం ప్రైజ్​లు..

WhatsApp channel

సంబంధిత కథనం