Dhanteras 2024 : ధన త్రయోదశికి బంగారం కొంటున్నారా? ఈ శుభ ఘడియల వరకు ఆగండి..
Dhanteras 2024 timings : దేశవ్యాప్తంగా మంగళవారం ధన త్రయోదశని జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు కొన్ని శుభ ఘడియల్లో బంగారం కొనుగోలు చేస్తే మరిన్ని శుభ ఫలితాలు దక్కుతాయి. ఆ వివరాలు..
ధన త్రయోదశి/ ధంతేరాస్ రోజున బంగారం కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తుంటారు. ఐదు రోజుల దీపావళి పండుగ ఈ ధన త్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది. ఈసారి ధన త్రయోదశి మంగళవారం అంటే, అక్టోబర్ 29న వచ్చింది. అయితే, ఈరోజున బంగారం కొనుగోలు చేసేందుకు ప్రత్యేకించి శుభ ఘడియలు ఉంటాయి. ఇవి ఒక్కో నగరంలో ఒక్కో సమయంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మంగళవారం బంగారు కొనుగోలుకు శుభ ముహూర్తం ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాము..
ధన త్రయోదశి శుభ ముహూర్తం..
అక్టోబర్ 29న ధన త్రయోదశి పూజా ముహూర్తం సాయంత్రం 6 గంటల 57 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 21 నిమిషాల వరకు. ప్రదోష కాలం సాయంత్రం 5 గంటల 55 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 21 నిమిషాల వరకు ఉంది. త్రయోదశి తిథి ఉదయం 10 గంటల 31కి మొదలై, అక్టోబర్ 30 మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల వరకు కొనసాగుతుంది.
సాధారణంగా ధన త్రయోదశి ప్రదోష కాలంలో బంగారం కొనుగోలుకు శుభ ఘడియలుగా భావిస్తుంటారు.
సాయంత్రం 6:45- రాత్రి 8:15- హైదరాబాద్
సాయంత్రం 6:55- రాత్రి 8:22- బెంగళూరు
సాయంత్రం 7:04- రాత్రి 8:37- ముంబై
సాయంతరం 6:31- రాత్రి 8:13- దిల్లీ
10 నిమిషాల్లో డెలివరీ..
ధన త్రయోదశి వేళ సాధారణంగా బంగారు లేదా వెండి ఆభరణాలు కొంటూ ఉంటారు. ఇంకొందరు బంగారం, వెండి కాయిన్స్ కొనుగోలు చేస్తుంటారు. వీరి కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి.
ధన త్రయోదశి నాడు బ్లింకిట్, బిగ్‌బాస్కెట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌లలో గోల్డ్, వెండి కాయిన్స్‌ని ఆర్డర్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే మీకు డెలివరీ చేస్తాయి.
యాప్‌లలో చూసినట్లుగా, బ్లింకిట్ జోయాలుక్కాస్- మలబార్ గోల్డ్ & డైమండ్స్‌తో జతకట్టింది. జెప్టో మలబార్ గోల్డ్ & డైమండ్స్, ఆగ్మాంట్లతో జతకట్టింది; స్విగ్గీ ఇన్స్టామార్ట్తో నెక్ బై జార్, ముత్తూట్ ఎగ్జిమ్, మలబార్ కనెక్ట్ అయ్యింది; బిగ్ బాస్కెట్ టాటా యాజమాన్యంలోని నగల వ్యాపారి తనిష్క్‌తో జతకట్టింది. ఈ విధంగా గోల్డ్- సిల్వర్ కాయిన్స్‌ని ఆర్డర్ చేసిన 10 నిమిషాలకే డెలివరీ చేస్తామని ఆయా సంస్థలు చెబుతున్నాయి.
బ్లింకిట్‌లో, మీరు మలబార్ 24కే లక్ష్మీ బంగారు నాణెం (1 గ్రా), మలబార్ 24కే లక్ష్మీ రోజ్ గోల్డ్ కాయిన్ (0.5 గ్రాములు), మలబార్ 99.9% స్వచ్ఛమైన లక్ష్మీ గణేష్ వెండి నాణెం (10 గ్రాములు) కొనుగోలు చేయవచ్చు. అలాగే, జోయాలుక్కాస్ 99.9% స్వచ్ఛమైన లక్ష్మీ గణేష్ సిల్వర్ కాయిన్ (10 గ్రా), జోయాలుక్కాస్ 24కె లక్ష్మీ గణేష్ బంగారు నాణెం (0.5 గ్రా మరియు 1 గ్రా) కొనొచ్చు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో, మీరు జార్ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ (0.1 గ్రా, 0.5 గ్రా, 0.25 గ్రా మరియు 1 గ్రా), ముత్తూట్ ఎగ్జిమ్ 24కే గోల్డ్ కాయిన్ (1 గ్రా) తో పాటు ఇతర వెండి వస్తువులు, మలబార్ 24కే గోల్డ్ కాయిన్ (1 గ్రా), 999 ప్యూరిటీ సిల్వర్ కాయిన్స్ (5 గ్రాములు, 11.66 గ్రాములు, 20 గ్రాములు) కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత కథనం