Denta Water IPO : డెంటా వాటర్ ఐపీఓ.. నిమిషాల్లో పూర్తిగా సబ్‌స్క్రైబ్.. జీఎంపీ చెక్ చేయండి
Denta Water IPO : డెంటా వాటర్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. గంట వ్యవధిలోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. గ్రే మార్కెట్‌లో ధర ఎంత ఉందో తెలుసుకోండి.
జనవరి 22న డెంటా వాటర్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుండి భారీగా స్పందన లభించింది. గంట వ్యవధిలోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. బిడ్డింగ్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అవ్వడం విశేషం. ఇది జనవరి 24న క్లోజ్ అవుతుంది. వేలం వేసిన మొదటి రోజు మధ్యాహ్నం 12:14 గంటల వరకు 220.50 కోట్ల డెంటా వాటర్ ఐపీఓ 6.59 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. 52,50,000 షేర్లకు బదులుగా 3,46,23,500 షేర్లకు బిడ్‌లు వచ్చాయి. .
భారీగా సబ్‌స్క్రైబ్
ఇప్పటివరకు రిటైల్ వర్గం 7.61 రెట్లు సబ్‌స్క్రిప్షన్, ఎన్ఐఐకి 10.95 రెట్లు సబ్‌స్క్రిప్షన్, క్వాలిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ బయ్యర్స్ కేటగిరీలో 1.55 రెట్లు సబ్‌స్క్రైబ్ పొందింది. ఐపీఓ జనవరి 24న ముగిసిన తర్వాత దాని షేర్ల కేటాయింపు జనవరి 27న ఖరారు చేస్తారు. జనవరి 29న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టింగ్ జరుగుతుంది. ప్రైస్ బ్యాండ్‌ను రూ.279 నుంచి రూ.294 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మెుత్తం రూ.220.50 కోట్లను సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది.
జీఎంపీ ధర
గ్రే మార్కెట్ ప్రీమియం Investorgain.com ప్రకారం డెంటా వాటర్ షేర్ ధర రూ.165 ప్రీమియంతో ట్రేడ్ అవుతుందని అంచనా వేసింది. మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం డెంటా వాటర్ అండ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్‌లో ప్రస్తుతం ఒక్కొక్కటి రూ.459 వరకు ఉన్నాయని అంచనా. ఇది బలమైన లిస్టింగ్ లాభాన్ని సూచిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే జీఎంపీ అనేది మార్కెట్ సెంటిమెంట్‌లపై ఆధారపడి ఉంటుంది. మారుతూ ఉండవచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇష్యూ ధర కంటే ఎక్కువ చెల్లించడానికి పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచుతుంది.
220 కోట్లు టార్గెట్
డెంటా వాటర్ అండ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ద్వారా రూ. 220.5 కోట్ల విలువైన 75 లక్షల షేర్ల విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.66 కోట్లకు పైగానే సమీకరించినట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. సబ్‌స్క్రిప్షన్ జనవరి 24న ముగుస్తుంది. ఐపీఓ ద్వారా వచ్చే మెుత్తంలో రూ. 150 కోట్ల మేరకు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించనున్నారు. కొంత భాగాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనం కోసం వినియోగిస్తారు.
కంపెనీ లిస్టులో ఎన్నో ప్రాజెక్టులు
డెంటా వాటర్ అండ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ (DWISL) 2016లో స్థాపించారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) సేవల రంగంలో కీలకమైన కంపెనీగా ఉంది. రైల్వే, హైవే రంగాలలో నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపట్టింది. ఇది 32 నీటి నిర్వహణ ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటిలో 11 ప్రాజెక్టులు ప్రధాన కాంట్రాక్టర్‌గా కంపెనీ ఉంది. 1 ప్రాజెక్ట్ కన్సార్టియం/జాయింట్ వెంచర్ ఏర్పాటు కింద, 20 ప్రాజెక్టులు ప్రధాన కాంట్రాక్టర్‌తో సబ్ కాంట్రాక్ట్ ఏర్పాటు కింద చేపట్టారు.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం ఐపీఓ గురించిన సమాచారం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.