Alienware m15 R7 | గేమింగ్ ప్రియుల కోసం శక్తివంతమైన ల్యాప్‌టాప్!
గేమింగ్ ప్రియుల కోసం శక్తివంతమైన Alienware m15 R7 ల్యాప్‌టాప్ AMD ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది. దీని ధర, ఫీచర్లు చూడండి.
ప్రముఖ పీసీ మేకర్ Dell కంపెనీ అనుబంధ సంస్థ అయిన Alienware, తాజాగా తమ బ్రాండ్ నుంచి Alienware m15 R7 అనే సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ USB4కి సపోర్ట్ చేస్తుంది, తద్వారా మరింత వేగవంతమైన పనితీరును కనవరుస్తుంది.

Dell Alienware m15 R7 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటిది RTX 3060 బేస్ వేరియంట్ 512GB- స్టోరేజ్ కలిగిన M.2 PCIe NVMe సాలిడ్ స్టేట్ డ్రైవ్‌తో రాగా, రెండోది 3070 Ti టాప్-స్పెక్ వేరియంట్ 1TB M.2 PCIe NVMe సాలిడ్ స్టేట్ డ్రైవ్‌తో వస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు 16GB DDR5 RAMని కలిగి ఉంటాయి. అలాగే Alienware కమాండ్ సెంటర్ ద్వారా అనుకూలీకరించదగిన RGB AlienFX ఇల్యూమినేటెడ్ కీబోర్డ్‌ను కలిగి ఉంటాయి.
ఇది గేమింగ్ ల్యాప్‌టాప్ కాబట్టి హీట్ నియంత్రణ కోసం ప్రత్యేకమైన క్రయో-టెక్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. అదనంగా, Alienware m15 R7 అంతర్గత వాయుప్రసరణ 1.3x వరకు ఎక్కువ గాలి ప్రవాహాన్ని అందిస్తుంది, శక్తి వినియోగాన్ని తగ్గించేటప్పుడు శీతలీకరణను పెంచుతుంది.
Alienware m15 R7 ల్యాప్‌టాప్‌లో మరిన్ని ఫీచర్లు, స్పెక్స్ ఎలా ఉన్నాయి, ధర తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం.
Dell Alienware m15 R7 ల్యాప్‌టాప్ ఫీచర్లు, స్పెక్స్
- 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల పూర్తి HD డిస్‌ప్లే
- Nvidia 6GB GDDR6 లేదా 8GB GDDR6 గ్రాఫిక్స్ కార్డ్
- 16GB DDR5 RAM, 512GB/1TB ఇంటర్నల్ స్టోరేజ్
- ఆక్టా-కోర్ AMD రైజెన్ 7 6800H ప్రాసెసర్
- డాల్బీ అట్మాస్ టెక్నాలజీ, 2.5W స్టీరియో స్పీకర్‌లు
- 86Wh బ్యాటరీ, 240W అడాప్టర్
Alienware m15 R7 (AMD) ల్యాప్‌టాప్‌లో ఇంకా Wi-Fi 6 , బ్లూటూత్ v5.2, రెండు USB 3.2 Gen 1 Type-A పోర్ట్‌లు, ఒక USB 3.2 Gen 1 Type-A ఉన్నాయి. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
ధరలు ఇలా ఉన్నాయి. RTX 3060 వేరియంట్ ధర రూ. 1,59,990 నుండి ప్రారంభమవుతుంది
RTX 3070 Ti వేరియంట్ ధర, రూ. 1,99,990 వరకు ఉంటుంది.
ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం Dell.com, Dell ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు,మల్టీ-బ్రాండ్ ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం