అప్పులు, ఈఎంఐలు, క్రెడిట్ పేమెంట్స్‌తో ఆర్థిక ఊబిలో కూరుకుపోయారా? అన్ని అప్పులను మేనేజ్ చేయడం మానసిక ఒత్తిడిని గురిచేసే విషయం. మరి, ఒక పర్సనల్ లోన్ తీసుకుని అప్పులన్నీ ఒకేసారి తీర్చేస్తే? ఇది మంచి పరిష్కారమేనా? దీని వల్ల స్వల్ప కాలంలో కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయా? పూర్తి విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..
క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్, ఈఎంఐలు వంటి అప్పులను ఒక లోన్‌గా మార్చి, దానిని నెలవారీగా తీర్చడాన్ని డెట్ కన్సాలిడేషన్ అంటారు. సాధారణంగా ఒక పర్సనల్ లోన్ తీసుకుని ప్రస్తుత అప్పులను తీర్చేస్తుంటారు. ఫలితంగా అన్ని అప్పులను ట్రాక్ చేయకుండా, ఒకదానిపై ఫోకస్ చేసే అవకాశం లభిస్తుంది.
పర్సనల్ లోన్ అనేది ఒక రకమైన అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కాబట్టి మీరు ఎటువంటి హామీ (కొలాటరల్) ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్సనల్ లోన్‌లు.. వినియోగదారులకు బాగా నచ్చుతాయి, ఎందుకంటే అవి:
పొందడం సులువు: తక్కువ డాక్యుమెంట్స్‌తో సులభంగా పొందవచ్చు.
త్వరగా పంపిణీ: తరచుగా ఒకటి లేదా రెండు రోజుల్లో డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.
సరసమైన వడ్డీ రేట్లు: మీకు మంచి క్రెడిట్ రేటింగ్ ఉంటే సరసమైన వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్‌లు లభిస్తాయి.
సింపుల్ రీ-పేమెంట్: సులభమైన తిరిగి చెల్లింపు ఎంపికలు మీ రీపేమెంట్స్ని నిర్వహించడానికి, బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడతాయి.
ఒకే ఈఎంఐ : అనేక రుణదాతలను, గడువు తేదీలను, కనీస చెల్లింపు తేదీలను ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని. ఒకే స్థిరమైన ఈఎంఐ మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, చెల్లింపులు మిస్ కాకుండా చూస్తుంది.
తక్కువ వడ్డీ ఖర్చు: మీరు ప్రస్తుతం చూస్తున్న వడ్డీ రేట్ల కంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందినప్పుడు, పర్సనల్ లోన్ ద్వారా కాలక్రమేణా తక్కువ వడ్డీని చెల్లించవచ్చు.
క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది: మీరు పర్సనల్ లోన్‌ను సకాలంలో తిరిగి చెల్లించినప్పుడు, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి, మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడతాయి.
నిర్ణీత కాలపరిమితి: పర్సనల్ లోన్‌కు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది కాబట్టి మీరు దానిని విజయవంతంగా తిరిగి చెల్లిస్తే అన్ని సమస్యలు దూరమవుతాయి.
అద్భుతాలు జరగవు: రుణ ఏకీకరణ అనేది మీ అప్పు స్వరూపాన్ని మాత్రమే మారుస్తుంది తప్ప, మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని కాదు! మీరు బడ్జెట్‌కు మించి ఖర్చు చేయడం కొనసాగిస్తే లేదా చెల్లింపులు చేయకపోతే, మీరు మరింత దారుణమైన అప్పుల చక్రంలోకి వెళ్లిపోతారు.
ఫీజులు ఉండే అవకాశం: పర్సనల్ లోన్‌తో సంబంధం ఉన్న అడ్మిన్ ఫీజులు లేదా ముందస్తు చెల్లింపునకు పెనాల్టీ వంటి హిడెన్ ఛార్జీల గురించి జాగ్రత్తగా ఉండండి.
తక్కువ కాలపరిమితితో అధిక ఈఎంఐలు: తక్కువ కాలపరిమితి మీ లోన్‌ను త్వరగా ముగించడానికి సహాయపడుతుంది. కానీ అది సాధారణంగా అధిక నెలవారీ ఈఎంఐలతో వస్తుంది! ఇది మీ ఖర్చు చేయగల ఆదాయాన్ని పరిమితం చేస్తుంది.
డెట్ కన్సాలిడేషన్ కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఎప్పుడంటే..
చివరిగా.. అనేక అప్పులను పర్సనల్ లోన్‌గా కలపడం వల్ల మీ ఆర్థిక పరిస్థితులపై వెంటనే ఒక క్లారిటీ వస్తుంది. మీకు డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంది. కానీ దీనికి నిబద్ధత, సంకల్పం, నిజాయితీతో కూడిన బడ్జెట్ ప్లానింగ్ అవసరం. మీరు సంతకం చేసే ముందు, ఎల్లప్పుడూ నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా చదవండి. వివిధ రుణదాతల ఆఫర్‌లను పోల్చి చూసుకోండి.
సంబంధిత కథనం