ITR filing deadline: ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇంకో 4 రోజులే గడువు
ITR filing deadline: 2021-22కు సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయని వారికి డిసెంబరు 31తో గడువు పూర్తవుతోంది.
2021-22 ఐన్‌కమ్ టాక్స్ రిటర్న్(ఐటీఆర్) మీరు సమర్పించలేదా? ఆలస్యమైనవి, సవరించినవి సమర్పించడానికి 31 డిసెంబరు 2022న గడువు ముగుస్తుంది. అంటే ఈరోజుతో కలిపి ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ఐటీ రిటర్నులు గడువులోపు దాఖలు చేయని వారి కోసం ఐటీ శాఖ డిసెంబరు 31 వరకు ‘ఆలస్యపు ఐటీ రిటర్నులు’ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.
ఈ గడువు లోపు కూడా ఆలస్యపు ఐటీ రిటర్నులు దాఖలు చేయని పక్షంలో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రివైజ్డ్ ఐటీ రిటర్నుల విషయంలో పెనాల్టీ ఉండదు.
Belated Return: ఆలస్యపు రిటర్నులు
సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయని వారు ఈ బిలేటెడ్ ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనికి గడువు డిసెంబరు 31. ఇందుకు ఐటీ చట్టంలోని సెక్షన్ 139(4) అనుమతిస్తుంది.
Revised Return: సవరించిన రిటర్నులు
పన్ను చెల్లింపుదారులు సకాలంలో ఐటీ రిటర్నులు దాఖలు చేసి, ఆ తరువాత ఏవైనా దోషాలు ఉన్నట్టు గమనించినప్పుడు ఆ టాక్స్ రిటర్నులను రివైజ్ చేసి తిరిగి దాఖలు చేయవచ్చు. ఇందుకు కూడా గడువు డిసెంబరు 31 మాత్రమే.
Updated ITRs: అప్‌డేట్ చేసిన ఐటీఆర్ విషయంలో ఇలా..
2022 ఫైనాన్స్ చట్టం కొత్తగా ఈ నవీకరించిన ఐటీఆర్ దాఖలు కాన్సెప్ట్ తెచ్చింది. దీని ప్రకారం టాక్స్ పే చేసిన వాళ్లు రెండేళ్ల లోపు అప్‌డేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఒరిజినల్ ఐటీఆర్ దాఖలు చేసిన వారు, చేయని వారు, రివైజ్ చేసిన వారు ఎవరైనా ఈ అప్‌డెటెడ్ ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.
ఈ కొత్త ఫారం ఐటీఆర్-యూ ఈ ఏడాది మేలో అందుబాటులోకి వచ్చింది. ఒరిజినల్ ఫైలింగ్స్‌లో మిస్ అయినవేవైనా ఉంటే అప్ డేట్ చేసుకోవచ్చు. తప్పులు ఉంటే దిద్దుకోవచ్చు. అయితే ఒక అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఒకసారి మాత్రమే అప్‌డేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది.