Tax saving : ట్యాక్స్ సేవ్ చేయాలా? ఈ పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్కి వారం రోజులే టైమ్ ఉంది..
Tax saving schemes : 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు, పన్ను చెల్లింపుదారులు మార్చ్ 31 లోపు ఆదాయపు పన్ను చట్టంలోని సంబంధిత సెక్షన్లలో ఇచ్చిన పన్ను పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టాలి. అంటే ఇంకా వారం రోజుల గడువు మాత్రమే ఉంది!
డెడ్‌లైన్ అలర్ట్! 2024-24 ఆర్థిక ఏడాదికి గాను ట్యాక్స్ సేవింగ్ పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పన్ను మినహాయింపు పొందేందుకు ఇంకా ఒక వారం గడువు మాత్రమే మిగిలి ఉంది. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నా లేదా ఎంచుకోబోతున్నా.. 2025 మార్చ్ 31లోపు పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
పాత పన్ను విధానంతో పోల్చితే కొత్త పన్ను విధానంలో మీ ట్యాక్స్ కాల్క్యులేషన్ తక్కువగా (పన్ను మినహాయింపు తర్వాత కూడా) ఉంటే.. కొత్త పన్ను విధానంతోనే కొనసాగాలని, కేవలం ట్యాక్స్ సేవింగ్స్ కోసం చేసే పెట్టుబడులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఇవి గుర్తుపెట్టుకోండి..
1. డెడ్‌లైన్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపు పొందడానికి పన్ను చెల్లింపుదారులు మార్చ్ 31 లోపు పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. మార్చ్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తే అది వచ్చే ఏడాదికి పన్ను ఆదాగా పరిగణిస్తారు.
2. పన్ను ఆదా సాధనాలు: పన్ను ఆదా సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ(1), 80జీ కింద ఇచ్చిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
80సీ కింద ట్యాక్స్ సేవింగ్ పథకాల్లో ఎన్ఎస్సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్), పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), కేవీపీ (కిసాన్ వికాస్ పత్ర), ఎస్ఎస్వై (సుకన్య సమృద్ధి యోజన), ఎస్సీఎస్ఎస్ (సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్) వంటివి ఉన్నాయి.
అదే సమయంలో, సెక్షన్ 80 సీసీసీ.. జీవిత బీమా అందించే కొన్ని పెన్షన్ పథకాలకు కంట్రిబ్యూషన్లను కలిగి ఉంటుంది. 80 సీసీడీ(1) ఎన్‌పీఎఫ్‌కి కంట్రిబ్యూషన్లను కలిగి ఉంటుంది. అదే సమయంలో రిలీఫ్ ఫండ్లు, ధార్మిక సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపును 80జీ అందిస్తుంది.
3. గరిష్ట పరిమితి: సెక్షన్ 80 సీ, 80 సీసీసీ, 80 సీసీడీ (1) కింద అన్ని పొదుపు సాధనాలకు గరిష్ట పరిమితి రూ .1.5 లక్షలు అని గుర్తుపెట్టుకోవాలి.
4. మీరు రూ .1.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టగలిగినప్పటికీ, గరిష్ట పరిమితి రూ .1.5 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపునకు అనుమతి ఉంటుంది.
5. కొత్త పన్ను విధానం: పైన చెప్పినట్లుగా పాత పన్ను విధానం ఎంచుకోవాలా? లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? అని పన్ను చెల్లింపుదారులు ఆలోచించుకోవాలి. పాత పన్ను విధానంలో ఉంటేనే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో ఇచ్చిన ఆదాయపు పన్ను కాలిక్యులేటర్‌ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
ఇక్కడ, మీరు నమోదు చేసే ఇన్పుట్స్ ఆధారంగా ఏ పన్ను విధానం ఎంత ఆదాయపు పన్ను బాధ్యతకు దారితీస్తుందో అంచనా వేయవచ్చు.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. ఫైనాన్స్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం