DCX Systems IPO: డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీఓ అలాట్మెంట్ ప్రారంభం-dcx systems ipo share allotment announced what gmp signals ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Dcx Systems Ipo: Share Allotment Announced. What Gmp Signals

DCX Systems IPO: డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీఓ అలాట్మెంట్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 09:55 PM IST

DCX Systems IPO: DCX IPO షేర్స్ అలాట్ మెంట్ ప్రకటన వెలువడింది. షేర్స్ అలాట్ అయినవారికి సంబంధిత సందేశాలు రావడం ప్రారంభమైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock)

DCX Systems IPO: DCX Systems IPO కు మంచి స్పందన లభించింది. గ్రే మార్కెట్ లోనూ మంచి ప్రీమియంతో ఇది ట్రేడ్ అవుతోంది. బుధవారం ఈ షేరు గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) రూ. 90 గా ఉంది. అంటే, ఇష్యూ ప్రైస్ కన్నా రూ. 90 ఎక్కువకు ఇది తొలిరోజు ట్రేడ్ కానుంది. ఇష్యూ ప్రైస్ రూ. 207 అయితే, తొలిరోజు, రూ. 297తో లిస్ట్ అయ్యే అవకాశముంది.

ట్రెండింగ్ వార్తలు

DCX Systems IPO: నవంబర్ 11న లిస్టింగ్

ఈ షేరు నవంబర్ 11 న షేర్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశముంది. ఈ షేరు జీఎంపీ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ.. అదే ప్రీమియంతో లిస్ట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేం. లిస్ట్ అయ్యే రోజు పరిస్థితులు, కంపెనీ ఫైనాన్షియల్స్ తదితరాల ఆధారంగా లిస్టింగ్ ప్రైస్ మారుతూ ఉంటుంది.

DCX Systems IPO: షేర్ అలాట్ మెంట్..

షేర్ అలాట్మెంట్ ప్రారంభమైనందున, రీఫండ్ ప్రాసెస్ కూడా ప్రారంభమవుతుంది. నవంబర్ 10న అలాట్ అయినవారి డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. అనంతరం, నవంబర్ 11న బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయ్యే అవకాశముంది. అలాట్ మెంట్ వివరాల కోసం bseindia.com లేదా, linkintime.co.in వెబ్ సైట్లను సందర్శించవచ్చు.

WhatsApp channel