Day Trading Stocks: ట్రేడర్లూ.. నేడు ఈ 9 స్టాక్‍లను ఫోకస్ చేయండి!-day trading stocks to buy for today stocks to buy check day trading guide ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Stocks To Buy For Today Stocks To Buy Check Day Trading Guide

Day Trading Stocks: ట్రేడర్లూ.. నేడు ఈ 9 స్టాక్‍లను ఫోకస్ చేయండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 01, 2023 08:06 AM IST

Day Trading Stocks: అనలిస్టుల సూచనల ప్రకారం, ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే. నేడు మార్కెట్లు ఎలా మొదలయ్యే ఛాన్స్ ఉందంటే..

Day Trading Stocks: ట్రేడర్లూ.. నేడు ఈ 9 స్టాక్‍లను ఫోకస్ చేయండి!
Day Trading Stocks: ట్రేడర్లూ.. నేడు ఈ 9 స్టాక్‍లను ఫోకస్ చేయండి!

Day Trading Guide For Today: కొన్ని సెషన్ల నుంచి సానుకూలంగా సాగిన భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‍లో నష్టాలను చూశాయి. బుధవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 99.45 పాయింట్లు క్షీణించి 18,534.40కు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 346.89 పాయింట్లు కోల్పోయి 62,622.24 వద్దకు దిగజారింది. బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్లు తగ్గి 44,128 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం చూపించాయి. ఇక నేడు (జూన్ 1, గురువారం) భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‍గా ఆరంభమయ్యేలా కనిపిస్తున్నాయి. ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఏవో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్‍గా ఓపెన్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో ఉంది. బుధవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు నష్టాలనే చూశాయి.

అయితే, స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఇప్పటికీ సానుకూలంగానే ఉందని ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలీ పరేఖ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిఫ్టీ ఇంకా పడితే 18,460 లెవెల్స్ వద్ద నియర్ టర్మ్ సపోర్ట్ ఉందని అన్నారు. 18,650 లెవెల్స్ వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురవుతోందని చెప్పారు. ఆ జోన్‍లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోందని విశ్లేషించారు. నిఫ్టీ మరింత పైకి వెళితే 18,700 వద్ద మఖ్యమైన రెసిస్టెన్స్ ఉందని పేర్కొన్నారు.

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఇవే

  • బోరోసిల్ రెన్యూవబుల్స్: బై అట్ రూ.545, టార్గెట్: రూ.567, స్టాప్ లాస్: రూ.536
  • బాంబే డయింగ్: బై అట్ రూ.83, టార్గెట్: రూ.87, స్టాప్ లాస్: రూ.81
  • ఇంటెలెక్ట్ డిజైన్: బై అట్ రూ.586, టార్గెట్: రూ.608, స్టాప్ లాస్: రూ.577
  • బజాజ్ ఫైనాన్స్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.7,250 నుంచి రూ.7,325, స్టాప్ లాస్: రూ.6,825
  • హావెల్స్ ఇండియా: బై అట్ రూ.1,307, టార్గెట్: రూ.1,365, స్టాప్ లాస్: రూ.1,275
  • ఐఆర్‌సీటీసీ: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.685, స్టాప్ లాస్: రూ.634
  • పతంజలి ఫుడ్స్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.1,110, స్టాప్ లాస్: రూ.998
  • వోల్టాస్: బై అట్ రూ.820, టార్గెట్: రూ.835, స్టాప్ లాస్: రూ.810
  • ఐజీఎల్: బై అట్ రూ.481, టార్గెట్: రూ.495, స్టాప్ లాస్: రూ.470

(గమనిక​:- ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునేముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel