Day Trading Stocks for Today: డే ట్రేడింగ్ స్టాక్స్: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఇవే-day trading stocks for today march 21 2023 stocks to buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Stocks For Today March 21 2023 Stocks To Buy

Day Trading Stocks for Today: డే ట్రేడింగ్ స్టాక్స్: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 21, 2023 06:57 AM IST

Day Trading Stocks for Today: స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. నిపుణుల సూచనల ప్రకారం, డే ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే.

Day Trading Guide Today: ట్రేడర్లు గమనించాల్సిన స్టాక్స్‌
Day Trading Guide Today: ట్రేడర్లు గమనించాల్సిన స్టాక్స్‌

Day Trading Guide for Today: అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో సోమవారం సెషన్‍లో భారత మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 111.65 పాయింట్లు కోల్పోయి 16,988.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 360.95 పాయింట్లు క్షీణంచి 57,628 పాయింట్ల వద్దకు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ కూడా 236.15 పాయింట్లు పతనమై 39,361.95కు చేరింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు మరింత ఎక్కువగా పడిపోయాయి. ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రకారం నేడు (మార్చి 21, మంగళవారం) భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఎలా ఓపెన్ అయ్యే అవకాశం ఉందో, ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ ఏవో ఓ లుక్కేయండి.

ట్రెండింగ్ వార్తలు

లాభాలతో ఓపెన్!

Day Trading Guide for Today: భారత స్టాక్ మార్కెట్ నేడు లాభాలతో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 83 పాయింట్ల లాభంతో ఉంది. మరోవైపు సోమవారం ట్రేడింగ్ సెషన్‍ను అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగించాయి.

Day Trading Guide for Today: టెక్నికల్ అంశాలపరంగా చూసుకుంటే నిఫ్టీ కాస్త పెరిగినా.. షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగెటివ్‍గానే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. “నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగెటివ్‍గానే కనిపిస్తోంది. చివరి మూడు సెషన్‍లలో లోవర్ షాడోస్ ఏర్పడ్డాయి. చార్టులో 16,800 లెవెల్స్ దిగువస్థాయి వద్ద డోజి, హ్యామర్ టైప్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. నిఫ్టీ లోవర్ బాటమ్ రివర్సల్ ఇస్తుందని ఇవి సూచిస్తున్నాయి. 17,150 లెవెల్స్ పైకి వచ్చి నిలదొక్కుకుంటే నిఫ్టీ సానుకూలంగా ఉందని అనుకోవచ్చు” అని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారుతుండటంతో ముఖ్యంగా డే ట్రేడింగ్ చేసే వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా విషయాలను తెలుసుకంటూ ఆ మేరకు స్ట్రాటజీ అనుసరించాలని చెబుతున్నారు.

Day Trading Stocks for Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్

  • పిడిలైట్ ఇండస్ట్రీస్: బై అట్ రూ.2,372, టార్గెట్: రూ.2,460, స్టాప్ లాస్: రూ.2,342
  • హిందుస్థాన్ యునిలివర్: బై అట్ రూ.2,511, టార్గెట్: రూ.2,600, స్టాప్ లాస్: రూ.2,475
  • గోద్రెజ్ కన్జ్యూమర్: బై అట్ రూ.960, టార్గెట్: రూ.990, స్టాప్ లాస్: రూ.955
  • గ్రాసిమ్ ఇండస్ట్రీస్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.1,620 నుంచి రూ.1,640, స్టాప్ లాస్: రూ.1,560
  • కొటాక్ మహీంద్రా బ్యాంక్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.1,730 నుంచి రూ.1,740, స్టాప్ లాస్: రూ.1,670
  • కోల్గేట్ పాల్మోలివ్: బై అట్ రూ.1,498, టార్గెట్: రూ.1,550, స్టాప్ లాస్: రూ.1,460
  • ఐసీఐసీఐ బ్యాంక్: బై అట్ రూ.836, టార్గెట్: రూ.855, స్టాప్ లాస్: రూ.825

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel