Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఏషియన్​ పెయింట్స్​ షేర్ ప్రైజ్​ టార్గెట్-day trading guide stocks to buy list today 1 march 2023 tata power iex ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide Stocks To Buy List Today 1 March 2023 Tata Power Iex

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఏషియన్​ పెయింట్స్​ షేర్ ప్రైజ్​ టార్గెట్

Sharath Chitturi HT Telugu
Mar 01, 2023 08:42 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​
స్టాక్స్​ టు బై లిస్ట్​

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు వరుసగా 8వ ట్రేడింగ్​ సెషన్​లోనూ నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో సెన్సెక్స్​ 326 పాయింట్లు కోల్పోయి 58,962 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 17,304 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీలో అమ్మకాల ఒత్తిడి కాస్త తగ్గింది. ఇక ఫిబ్రవరిని నిఫ్టీ 2శాతం మేర నష్టాలతో ముగించింది.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో డౌన్​ట్రెండ్​ కొనసాగుతోంది.

Stock market news today : "నిఫ్టీలో డౌన్​ట్రెండ్​ కొనసాగుతోంది. కీలకమైన సపోర్టులు బ్రేక్​ అవుతూనే ఉన్నాయి. 17150- 17050 లెవల్స్​ వద్ద మరో కీలక సపోర్ట్​ ఉంది. 17450 వద్ద రెసిస్టెన్స్​ ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4559.21కోట్లు విలువ చేస షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 4609.87కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

US Stock market investment tips in Telugu : అమెరికా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.71శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.3శాతం, నాస్​డాక్​ 0.1శాతం మేర పతనమయ్యాయి.

స్టాక్స్​ టు బై లిస్ట్​..

ఐఈఎక్స్​:- బై రూ. 144, స్టాప్​ లాస్​ రూ. 137, టార్గెట్​ రూ. 152

Tata Power share price target : టాటా పవర్​:- బై రూ. 202, స్టాప్​ లాస్​ రూ. 196, టార్గెట్​ రూ. 210

పాలీక్యాబ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3000, టార్గెట్​ రూ. 3150- రూ. 3170

Pidilite Industries share price target : పిడిలైట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2260, టార్గెట్​ రూ. 2350- రూ. 2360

Asian paints share price target : ఏషియన్​ పెయింట్స్​:- బై రూ. 2828, స్టాప్​ లాస్​ రూ. 2790, టార్గెట్​ రూ. 2910

ఏబీబీ ఇండియా:- బై రూ. 3217, స్టాప్​ లాస్​ రూ. 3165, టార్గెట్​ రూ. 3330

అశోక్​ లేల్యాండ్​:- బై రూ. 145, స్టాప్​ లాస్​ రూ. 153, టార్గెట్​ రూ. 142

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel