Stocks to buy today : స్టాక్స్​ టు పిక్​.. ఐటీసీ, టైటాన్​ షేర్లు ఇప్పుడు కొంటే లాభాలే!-day trading guide for tuesday itc titan among 7 stocks to buy today feb 14 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Tuesday: Itc, Titan Among 7 Stocks To Buy Today Feb 14 2023

Stocks to buy today : స్టాక్స్​ టు పిక్​.. ఐటీసీ, టైటాన్​ షేర్లు ఇప్పుడు కొంటే లాభాలే!

Sharath Chitturi HT Telugu
Feb 14, 2023 07:05 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​.. ((Photo: iStock))

Stocks to buy today : ఐటీ, బ్యాంక్​ సెక్టార్​ స్టాక్స్​లో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 251 పాయింట్ల నష్టంతో 60,431కు చేరింది. 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. 17,771 వద్ద ముగిసింది. ఐటీ సెక్టార్​ దాదాపు 2శాతం పతనమైంది. బీఎస్​ఈ స్మాల్​క్యాప్​, మిడ్​క్యాప్​ సూచీలు 1.25శాతం మేర నష్టపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

"నిఫ్టీలో ప్రస్తుతం రేంజ్​ బౌండ్​తో బలహీనమైన మూమెంట్​ కనిపిస్తోంది. షార్ట్​ టర్మ్​లో ఇది కొనసాగనుంది. కీలకమైన సపోర్ట్​లు 17,650- 17,600 వద్ద కొనుగోళ్ల జోరు మొదలయ్యే అవకాశం ఉంది. 17,900 అనేది రెసిస్టెన్స్​గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి అన్నారు.

ఎఫ్​ఐఐలు డీఐఐలు..

Stock market news today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1322.39కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 521.69కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

US Stock market investment tips in Telugu : అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 1.1శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.14శాతం, నాస్​డాక్​ 1.48శాతం మేర లాభాల్లో ముగిశాయి.

స్టాక్స్​ టు బై..

ITC Share price target : ఐటీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 362, టార్గెట్​ రూ. 392

డాబర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 500, టార్గెట్​ రూ. 580

Titan share price target : 'టైటాన్​ :- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2470, టార్గెట్​ రూ. 2575- రూ. 2600

ఎన్​టీపీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 164, టార్గెట్​ రూ. 172- రూ. 175

హింద్​ ఆయిల్​ ఈఎక్స్​పీ:- బై రూ. 136, స్టాప్​ లాస్​ రూ. 134, టార్గెట్​ రూ. 142

బజాజ్​ ఆటో:- బై రూ. 3883, స్టాప్​ లాస్​ రూ. 3835, టార్గెట్​ రూ. 4000

LT Share price target : ఎల్​ అండ్​ టీ (ఎల్​టీ):- బై రూ. 2203, స్టాప్​ లాస్​ రూ. 2170, టార్గెట్​ రూ. 2270

(గమిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel