Stocks to buy today : స్టాక్స్ టు బై- హెచ్డీఎఫ్సీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
Stocks to buy today : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : ఐటీ, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తడి కారణంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 335 పాయింట్లు కోల్పోయి 60,507 వద్ద ముగిసింది. నిఫ్టీ50.. 0.5శాతం నష్టంతో 17,765 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.75శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.49శాతం పతనమయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. 17,400- 18,000 లెవల్స్ మధ్యలో నిఫ్టీ కన్సాలిడేట్ అవ్వొచ్చు. మరికొన్ని సెషన్స్ పాటు ఈ కన్సాలిడేషన్ కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో స్టాక్స్‌ను పిక్ చేసుకునే సమయంలో ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి.
Stock market news today : "డైలీ ఛార్ట్‌లో నిఫ్టీ లోయర్ టాప్స్‌ను ఫార్మ్ చేసింది. బుల్స్ శక్తి తగ్గిపోతోందని ఇది సూచిస్తోంది. అయితే 17,650 లెవల్స్ వద్ద బుల్స్ యాక్టివ్ అవ్వొచ్చు. 17,950- 18000 లెవల్స్ నిఫ్టీకి కీలక రెసిస్టెన్స్‌గా ఉన్నాయి," అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ డే తెలిపారు.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
US Stock market investment in Telugu : అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.1శాతం, ఎస్ అండ్ పీ 500 0.6శాతం, నాస్డాక్ 1శాతం మేర నష్టపోయాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1218.14కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1203.9 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఏషియన్ పెయింట్స్:- :- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2698, టార్గెట్ రూ. 2860
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1859, టార్గెట్ రూ. 2010
బజాజ్ ఫినాన్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 5900, టార్గెట్ రూ. 6,300- రూ. 6,500
పవర్ గ్రిడ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 212, టార్గెట్ రూ. 223- రూ. 226
HDFC share price target : హెచ్డీఎఫ్సీ :- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2645, టార్గెట్ రూ. 2775
ట్రెంట్:- బై రూ. 1230, స్టాప్ లాస్ రూ. 1200, టార్గెట్ రూ. 1280
మెక్‌డావెల్:- బై రూ. 780, స్టాప్ లాస్ రూ. 767, టార్గెట్ రూ. 807
జీఎన్ఎఫ్సీ:- బై రూ. 531, స్టాప్ లాస్ రూ. 524, టార్గెట్ రూ. 545
Gail share price target : జెయిల్:- బై రూ. 94.8, స్టాప్ లాస్ రూ. 93.5, టార్గెట్ రూ. 98
(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)