Stocks to buy today : నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​.. ఈ షేర్లు కొంటే భారీ లాభాలే!-day trading guide for tuesday 6 stocks to buy today november 29 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Tuesday 6 Stocks To Buy Today November 29

Stocks to buy today : నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​.. ఈ షేర్లు కొంటే భారీ లాభాలే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 29, 2022 08:19 AM IST

Stocks to buy today : స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే (Photo: iStock)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నూతన శిఖరాలకు చేరుకున్నాయి. రిలయన్స్​ షేర్లు ఇచ్చిన జోష్​తో.. నిఫ్టీ50.. ఆల్​టైమ్​ హైని తాకింది. చివరికి 50 పాయింట్లు లాభపడి 18,562 వద్ద ముగిసింది. ఇక బీఎస్​ఈ సెన్సెక్స్​.. 211 పాయింట్లు వృద్ధిచెంది 62,505 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ స్మాల్​ క్యాప్​ సూచీ 0.77శాతం, మిడ్​ క్యాప్​ సూచీ 0.27శాతం పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50.. ప్రతి రెసిస్టెన్స్​నూ దాటుకుంటూ దూసుకెళుతోంది.

"వీక్లీ ఛార్ట్​ను చూస్తే.. నిఫ్టీ పైకి దూసుకెళుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వీక్​నెస్​ అస్సలు కనిపించడం లేదు. రివర్సెల్​లు కూడా లేవు. ఇక సోమవారం ఆల్​ టైమ్​హై(18,614)ని తాకింది. ఇక్కడి నుంచి 18,955 వరకు పెరగొచ్చు. 1-2 వారాల్లోనే ఇది సాధ్యపడొచ్చు. 18,350 అనేది సపోర్ట్​గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్టూరిటీస్ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

"నిఫ్టీ డైలీ ఛార్ట్​లో హ్యాంగింగ్​ మ్యాన్​ పాటర్న్​ ఏర్పడింది. ఆర్​ఎస్​ఐ ఇండికేటర కూడా బిల్లిష్​గానే ఉంది. షార్ట్​ టర్మ్​లో మార్కెట్లు ఇంకా పెరగొచ్చు," అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే పేర్కొన్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.

అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 1.45శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.54శాతం, నాస్​డాక్​ 1.58శాతం నష్టపోయాయి.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy list : విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 490, టార్గెట్​ రూ. 530
  • పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 49, టార్గెట్​ రూ. 60
  • బ్రిటానియా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 4150, టార్గెట్​ రూ. 4300-4340
  • ఏషియన్​ పెయింట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3075, టార్గెట్​ రూ. 3250- 3300
  • ఐటీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 332, టార్గెట్​ రూ. 355
  • అదానీ పోర్ట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 865, టార్గెట్​ రూ. 910

(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంత ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం