Day Trading Stocks: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఇవే: నేటి డే ట్రేడింగ్ గైడ్
Day Trading Stocks: డే ట్రేడింగ్ చేసే వారు నేటి స్టాక్ మార్కెట్ సెషన్‍లో ట్రాక్ చేయాల్సిన స్టాక్‍లు ఇవే. నిఫ్టీకి ముఖ్యమైన సపోర్ట్, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయంటే..
వరుసగా మూడు రోజులు లాభపడిన భారత స్టాక్ మార్కెట్లు.. బుధవారం మాత్రం నష్టపోయాయి. ఫైనాన్షియల్ కంపెనీల స్టాక్స్ నష్టపోవడంతో సూచీలపై ప్రభావం పడింది. ఎస్ఎస్ఈ నిఫ్టీ సూచీ 62.60 పాయింట్లు పడిపోయి 18,285.40కు చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 208.01 పాయింట్లు దిగజారి 61,773.78 పాయింట్లకు పడింది. బ్యాంక్ నిఫ్టీ 276.60 పాయింట్ల నష్టంతో 43,677.85 వద్దకు చేరింది. నేడు (మే 25, గురువారం) స్టాక్ మార్కెట్లు ఎలా మొదలయ్యే ఛాన్స్ ఉంది, ట్రేడర్లు గమనించాల్సిన స్టాక్స్ ఏవో ఇక్కడ చూడండి.
ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రకారం, భారత స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో లేకపోతే ఫ్లాట్‍గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో ఉంది. బుధవారం సెషన్‍లో కూడా అమెరికా మార్కెట్లు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీనతల ప్రభావం భారత మార్కెట్లపై పడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిటైల్ హీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు. యూఎస్ ఫెడ్ మీటింగ్ వివరాలు కూడా మార్కెట్లకు కీలకంగా ఉండనున్నాయని అన్నారు. “అమెరికా గరిష్ట రుణ పరిమితి చర్చల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో బలహీనత కనిపించింది. ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడింది. నష్టాలతో నిఫ్టీ ఓపెన్ కాగా ఒత్తిడి కొనసాగింది” అని ఆయన విశ్లేషించారు. నిఫ్టీ పడిపోతే 18,100 లెవెల్స్ వద్ద ముఖ్యమైన సపోర్ట్ జోన్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ నిఫ్టీ పైకి వెళితే 18,400 వద్ద కీలకమైన రెసిస్టెన్స్ ఉందని అంటున్నారు.
Stocks to Buy: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే
టాటా పవర్: బైట్ అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.220, స్టాప్ లాస్: రూ.199
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: బైట్ అట్ రూ.375, టార్గెట్: రూ.400, స్టాప్ లాస్: రూ.360
లారస్ ల్యాబ్స్: బైట్ అట్ రూ.335, టార్గెట్: రూ.360 నుంచి రూ.380, స్టాప్ లాస్: రూ.310
సుజ్లోన్ ఎనర్జీ: బైట్ అట్ సీఎంపీ, టార్గెట్: రూ.12, స్టాప్ లాస్: రూ.8.80
కోల్ ఇండియా: బైట్ అట్ సీఎంపీ, టార్గెట్: రూ.255 నుంచి రూ.258, స్టాప్ లాస్: రూ.231
జేకే టైర్: బైట్ అట్ రూ.181, టార్గెట్: రూ.194, స్టాప్ లాస్: రూ.174