Day trading guide for today: ఈ రోజు ఈ స్టాక్స్ తో లాభాలు
Day trading guide for today: హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ కుబోటా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు లాభాల బాటన నడుస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Day trading guide for today: హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ కుబోటా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు లాభాల బాటన నడుస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
సెన్సెక్స్, నిఫ్టీ..
పెద్ద కంపెనీల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు వెళ్లడంతో సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం ఒడిదుడుకులకు లోనై, చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి 66,459.31వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 19,733.55 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.23% నష్టపోగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% లాభపడింది. ఇంట్రా డేలో ఈ రెండు కూడా రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.2% లాభపడింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటు నిర్ణయం సహా పలు అంతర్జాతీయ పరిణామాలు బుధవారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.
‘హీరో’ షేర్లు ఢమాల్
ఈ రోజు టైటన్, ఇండిగో, అంబుజా సిమెంట్స్ Q1FY24 ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే, ట్రేడర్లు ఈ రోజు దృష్టి పెట్టాల్సిన స్టాక్స్ లో హీరో మోటో కార్ప్ ఒకటి. ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజల్ పై ఈడీ కేసు నమోదవడంతో, ఆ సంస్థ షేర్లు మంగళవారం దారుణంగా పడిపోయాయి. అలాగే, మెట్రో బ్రాండ్స్, అదానీ టోటల్ గ్యాస్, పీవీఆర్ ఐనాక్స్, థైరో కేర్ టెక్నాలజీస్, మేక్ మై ట్రిప్ షేర్లలో కూడా మంచి మూవ్ మెంట్ ను అంచనా వేస్తున్నారు.
Day trading stocks for today: ఈ స్టాక్స్ కొనండి..
చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బొగాడియా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వీపీ - రీసెర్చ్ అనుజ్ గుప్తా, ఆనంద్ రాఠీ సీనియర్ మేనేజర్ - టెక్నికల్ రీసెర్చ్ అంచనాల ప్రకారం హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ కుబోటా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు లాభాల బాటన నడుస్తాయి.
హెచ్డీఎఫ్సీ లైఫ్ : ప్రస్తుత ధర రూ. 642; టార్గెట్ ధర రూ. 660; స్టాప్ లాస్ రూ. 630
ఎన్టీపీసీ: ప్రస్తుత ధర రూ. 222; టార్గెట్ ధర రూ. 240; స్టాప్ లాస్ రూ.214.
యాక్సిస్ బ్యాంక్: ప్రస్తుత ధర రూ. 952; టార్గెట్ ధర రూ. 1010; స్టాప్ లాస్ రూ.934.
రిలయన్స్ ఇండస్ట్రీస్: ప్రస్తుత ధర రూ. 2518; టార్గెట్ ధర రూ. 2570; స్టాప్ లాస్ రూ.2490.
ఎస్కార్ట్స్ కుబోటా: ప్రస్తుత ధర రూ. 2563; టార్గెట్ ధర రూ. 2635; స్టాప్ లాస్ రూ.2510.
హెచ్ సీఎల్ టెక్నాలజీస్: ప్రస్తుత ధర రూ. 1,138.5; టార్గెట్ ధర రూ.1,175; స్టాప్ లాస్ రూ.1,110.
సూచన: ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.