Stocks to buy today : ఎస్బీఐ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే- ఐసీఐసీ బ్యాంక్ స్టాక్స్ కొంటే లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : అంతర్జాతీయ సానుకూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాల్లో ముగించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 243 పాయింట్లు పెరిగి 17,854 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 909 పాయింట్ల లాభంతో 60,841 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ.. 830 పాయింట్లు వృద్ధి చెంది 41,499 లెవల్ వద్ద క్లోజ్ అయ్యింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ డైలీ ఛార్ట్‌లో పెద్ద పాజిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది బుల్స్ జోరుకు సంకేతం! 17,750- 17,800 లెవల్స్‌ను బ్రేక్ చేసి క్లోజ్ అవ్వడం సానుకూల విషయం. ఫలితంగా షార్ట్ టర్మ్‌లో స్టాక్ మార్కెట్లు ఇంకా పెరగొచ్చు.
Stock market news : "నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. 18,250 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. మరో 2-3 వారాల సమయం పట్టొచ్చు. నిఫ్టీ సపోర్ట్ 17,650 వద్ద ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నగరాజ్ శెట్టి తెలిపారు.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
US Stock market investment : అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.3శాతం, ఎస్ అండ్ పీ 500 1.04శాతం, నాస్డాక్ 1.59శాతం నష్టాపోయాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 932.44కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1264.74కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
స్టాక్స్ టు బై లిస్ట్..
Stocks to buy list పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 48, టార్గెట్ రూ. 56
ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 140, టార్గెట్ రూ. 150
SBI share price target : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 610
అషోక్ లేల్యాండ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 147, టార్గెట్ రూ. 165
ICICI bank share price target : ఐసీఐసీఐ బ్యాంక్ :- బై రూ. 864, స్టాప్ లాస్ రూ. 845, టార్గెట్ రూ. 900
ఫెడరల్ బ్యాంక్:- బై రూ. 134, స్టాప్ లాస్ రూ. 127, టార్గెట్ రూ. 145
(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)