Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి ‘స్టాక్స్​ టు బై’ లిస్ట్​ ఇదే!-day trading guide for today 6 stocks to buy or sell on 11th november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today: 6 Stocks To Buy Or Sell On 11th November

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి ‘స్టాక్స్​ టు బై’ లిస్ట్​ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 08:29 AM IST

Stocks to buy today : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ట్రేడర్లు ట్రాక్​ చేయాల్సిన 6 స్టాక్స్​ను నిపుణులు సూచించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ50.. 128 పాయింట్ల నష్టంతో 18,028 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​.. 419 పాయింట్లు కోల్పోయి 60,613 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ 179 పాయింట్ల నష్టంతో 41,603 వద్దకు చేరుకుంది. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు కూడా గురువారం నష్టపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గానే ఉంది.

"డైలీ ఛార్ట్స్​లో హైయ్యర్​ టాప్స్​, హైయ్యర్​ బాటమ్స్​ పార్టర్న్​ కొనసాగుతోంది. 18,100 లెవల్స్​ను దాటితే.. నిఫ్టీ మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది. నిఫ్టీ సపోర్టు 17,950 లెవల్స్​ వద్ద ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి అభిప్రాయపడ్డారు. 17,950 దిగువకు నిఫ్టీ చేరుకుంటే.. మరింత ప్రాఫిట్​ బుకింగ్​ను చూడవచ్చని పేర్కొన్నారు.

కాగా.. నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్​ నిఫ్టీలో స్ట్రెంత్​ ఇంకా ఎక్కువగా కనిపిస్తోందని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాలతో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. 290 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

US inflation data : యూఎస్​ ద్రవ్యోల్బణం డేటా విడుదలైంది. ఇది అంచనాల కన్నా తక్కువగా నమోదు కావడంతో.. అక్కడి స్టాక్​ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 3.70శాతం మేర బలపడింది. ఎస్​ ఎండ్​ పీ 500 ఏకంగా 5.54శాతం లాభపడింది. నాస్​డాక్​ అయితే.. 7.35శాతం మేర పుంజుకుంది.

ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లకు సానుకూల పవనాలు అందాయి. అందుకే నిఫ్టీ కూడా లాభాల్లో ప్రారంభం కానుంది.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన 6 స్టాక్స్​ను నిపుణులు సూచించారు. అవేంటంటే..

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : విప్రో :- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 375, టార్గెట్​- రూ. 405,
  • ఎన్​టీపీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 164, టార్గెట్​- రూ. 190
  • కొటాక్​ మహీంద్ర బ్యాంక్​:- బై రూ. 1920, స్టాప్​ లాస్​ రూ. 1914, టార్గెట్​ రూ. 1932
  • టాటా స్టీల్​:- సెల్​ రూ. 104, స్టాప్​ లాస్​ రూ. 104.50, టార్గెట్​ రూ. 103
  • జ్యోతి ల్యాబ్స్​:- బై రూ .195, స్టాప్​ లాస్​ రూ. 192, టార్గెట్​ రూ. 202
  • పెట్రోనెట్​ ఎల్​ఎన్​జీ:- బై రూ. 212, స్టాప్​ లాస్​ రూ. 208, టార్గెట్​ రూ. 222

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా అనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం