Stocks to buy today : ట్రేడర్స్​.. ఈ 6 స్టాక్స్​ బై చేస్తే భారీ లాభాలే!-day trading guide for today 6 stocks to buy or sell 21st november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​.. ఈ 6 స్టాక్స్​ బై చేస్తే భారీ లాభాలే!

Stocks to buy today : ట్రేడర్స్​.. ఈ 6 స్టాక్స్​ బై చేస్తే భారీ లాభాలే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 21, 2022 08:35 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (MINT)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 87పాయింట్ల నష్టంతో 61,663 వద్ద ముగిసింది. నిఫ్టీ50.. 33పాయింట్లు కోల్పోయి 18,308 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 20 పాయింట్లు పడి 42,437 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. ద్రవ్యోల్బణం తగ్గినా.. వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను తగ్గించమని అమెరికా ఫెడ్​ అధికారులు చేసిన వ్యాఖ్యలు మదుపర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేశాయి. అయితే.. నిఫ్టీ ఛార్ట్స్​లో హయ్యర్​ హైస్​, హయ్యర్​ లోస్​ పాటర్న్​ ఏర్పడుతోందని వివరించారు.

Stock market news today : "నిఫ్టీలో కన్సాలిడేటెడ్​ దశ కనిపిస్తోంది. హైకి వచ్చేసరికి వీక్​నెస్​ కనిపిస్తోంది. అలా అని రివర్సల్​ జరుగుతోందనడానికి సంకేతాలేవీ కనిపించడం లేదు. 18100 లెవల్స్​ వద్ద సపోర్టు లభించొచ్చు. అక్కడి నుంచి నిఫ్టీ మళ్లీ పెరిగే అవకాశం ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి వివరించారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

మరోవైపు అమెరికా స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప లాభాల్లో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్​లో పెద్దగా మూమెంట్​ కనిపించడం లేదు.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : ఇన్ఫోసిస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1575, టార్గెట్​ రూ. 1615-1630

కోల్గోట్​ పాల్మోలివ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1560, టార్గెట్​ రూ. 1610- 1625

రేణుక షుగర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 49, టార్గెట్​ రూ. 65

ఈక్విటాస్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 49, టార్గెట్​ రూ. 60

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ):- బై రూ. 606, స్టాప్​ లాస్​ రూ. 604, టార్గెట్​ రూ. 612

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​):- బై రూ. 2614, స్టాప్​ లాస్​ రూ. 2607, టార్గెట్​ రూ. 2614

(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)