Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!-day trading guide for today 4 stocks to buy or sell on 25th november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today, 4 Stocks To Buy Or Sell On 25th November

Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!

Asit Manohar HT Telugu
Nov 25, 2022 08:14 AM IST

Stocks to buy today : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ట్రేడర్లు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే!
ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే! (Reuters)

Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులతో దేశీయ సూచీలు.. గురువారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా సెన్సెక్స్​.. రికార్డు గరిష్ఠాలను తాకింది. 762 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్​.. 62,272 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 217పాయింట్ల లాభంతో 18,484 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ.. 346 పాయింట్లు పెరిగి.. 43,075కు చేరింది. ఇది కూడా ఆల్​ టైమ్​ హైయే.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. అమెరికా స్టాక్​ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతల కారణంగా సూచీలు పెరుగుతున్నాయి. నిఫ్టీ టెక్నికల్​ ఛార్ట్​లో.. హయ్యర్​ హైస్​, హయ్యర్​ లోస్​ పాటర్న్​ ఫామ్​ అవుతోంది. ఇది బుల్లిష్​ ట్రెండ్​కు చిహ్నం. ఇక్కడి నుంచి పెరిగితే.. నిఫ్టీ ఆల్​ టైమ్​ హైని తాకవచ్చు.

Nifty short term trend : "గత ట్రేడింగ్​ సెషన్లలో నెలకొన్న ఒడిదొడుకులకు ముగింపు పడినట్టు కనిపిస్తోంది. తాజా కొనుగోళ్లతో మార్కెట్లు పెరుగుతున్నాయి. నిఫ్టీకి బలమైన రెసిస్టెన్స్​గా ఉన్న 18,400 మార్కు బ్రేక్​ అయ్యింది. ఇక ఇప్పుడు 18,606 అనేది రెసిస్టెన్స్​గా ఉంది. అది కూడా బ్రేక్​ అయితే.. మార్కెట్లు ఇంకా దూసుకెళతాయి. 18,400 లెవల్​ సపోర్ట్​గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన నాగరాజ్​ శెట్టి పేర్కొన్నారు.

అమెరికా ఫెడ్​ అధికారులు.. వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను తగ్గించాలన్న యోచనలో ఉండటం, డాలర్​ ఇండెక్స్​ పడుతుండటం, యూఎస్​ బాండ్​ యూల్డ్​లు పతనమవ్వడం.. అంతర్జాతీయంగా స్టాక్​ మార్కెట్లకు సానుకూలంగా మారాయి.

అయితే.. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​లో ఇంకా మూమెంట్​ కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల.. సెక్టార్లలో వచ్చే మూమెంట్​పై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప నష్టాల్లో ప్రారంభించవచ్చు. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : మారుతీ సుజుకీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 8800, టార్గెట్​ రూ. 9,200
  • టెక్​ మహీంద్రా:- బై రూ. 1100, స్టాప్​ లాస్​ రూ. 1050
  • ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (ఐఓసీ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 69, టార్గెట్​ రూ. 80
  • యూనియన్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 72, టార్గెట్​ రూ. 90

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం