Day trading guide: ఈ ఆరు స్టాక్స్ తో ఈ రోజు లాభాలే..
Day trading guide for today: టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్, ఎస్పీ అపారెల్స్, ఎంఆర్పీఎల్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్, ఎస్పీ అపారెల్స్, ఎంఆర్పీఎల్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
భారీ లాభాలు
బలమైన గ్లోబల్ మార్కెట్ సానుకూలత నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 231 పాయింట్లు లాభపడి 19,675 స్థాయిల వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 742 పాయింట్లు లాభపడి 65,675 మార్క్ వద్ద ముగిసింది, బ్యాంక్ నిఫ్టీ 310 పాయింట్ల లాభంతో 44,201 స్థాయిల వద్ద ముగిసింది. రియల్టీ, ఐటీ, ఆటో ఔట్ పెర్‌ఫార్మర్‌లతో అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి. బ్రాడ్ మార్కెట్‌లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.13 శాతం పెరగ్గా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం లాభపడింది.
ఇంట్రా డే గరిష్టం
భారతదేశం మరియు యుఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలలో సానుకూలత కారణంగా దేశీయ ఈక్విటీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయి, 19675 స్థాయిల వద్ద 232 పాయింట్ల (+1.2%) లాభంతో ఇంట్రా డే గరిష్ట స్థాయికి చేరుకుంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.ఐటీ, రియల్టీ, ఆయిల్ & గ్యాస్, ఆటో ఈరోజు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
నిఫ్టీ 20,050 వరకు..
ఈరోజు నిఫ్టీ 50 ఔట్‌లుక్‌పై హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ, "నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్ సానుకూలంగానే ఉంది. దాదాపు 19,600 స్థాయిల కీలక నిరోధం కంటే ఎక్కువగా కదులుతున్నందున, నిఫ్టీ 50 మరింత పురోగమించే అవకాశం ఉంది. 19,850 వద్ద రెసిస్టెన్స్ కు అవకాశం ఉంది. అలాగే, 19,500 వద్ద సపోర్ట్ సూచనలు ఉన్నాయి. సమీప కాలంలో 20,050 వరకు చేరుకునే అవకాశం ఉంది" అన్నారు.
ఈ స్టాక్స్ పై దృష్టి
మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న విరాట్ జాగడ్ అంచనాల ప్రకారం.. టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్, ఎస్పీ అపారెల్స్, ఎంఆర్పీఎల్. ... స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.
టీసీఎస్: ప్రస్తుత ధర రూ. 3404; టార్గెట్ ప్రైస్ రూ. 3570; స్టాప్ లాస్ రూ. 3320.
టాటా మోటార్స్: ప్రస్తుత ధర రూ. 671; టార్గెట్ ప్రైస్ రూ. 712; స్టాప్ లాస్ రూ. 649.
హెచ్ డీఎఫ్ సీ లైఫ్: ప్రస్తుత ధర రూ. 635; టార్గెట్ ప్రైస్ రూ. 650; స్టాప్ లాస్ రూ. 625
పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్: ప్రస్తుత ధర రూ. 790; టార్గెట్ ప్రైస్ రూ 850; స్టాప్ లాస్ రూ.765.
ఎస్పీ అపారెల్స్: ప్రస్తుత ధర రూ. 611; టార్గెట్ ప్రైస్ రూ 630; స్టాప్ లాస్ రూ.601
ఎంఆర్పీఎల్: ప్రస్తుత ధర రూ. 118; టార్గెట్ ప్రైస్ రూ 125; స్టాప్ లాస్ రూ.115
సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.